రామచంద్రపురం రూరల్: ఓ వ్యక్తి కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. ద్రాక్షారామ హెడ్ కానిస్టేబుల్ పి.మల్లికార్జునరావు కథనం ప్రకారం.. అనపర్తి మండలం కుతుకులూరుకు చెందిన తేతల వెంకటరెడ్డి (50) రామచంద్రపురం మండలం తాళ్లపొలం గ్రామంలోని ఉప్పు దయా నందం ఇంటి పునాదిలో ఇసుక నింపుతున్నాడు. ఆ సమయంలో మోటారుకు కలిపిన విద్యుత్ వైరు ప్రమాదవశాత్తూ తగిలి షాక్‌కు గురయ్యాడు. రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
విఘ్నేశ్వరుని హుండీ ఆదాయం రూ.51.47 లక్షలు
అయినవిల్లి: విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. మొత్తం వంద రోజులకు ఆలయ హుండీల ద్వారా రూ.49,93,177, అన్నప్రసాదం హుండీ ద్వారా రూ.1,54,347 కలిపి రూ.51,47,524 ఆదాయం సమకూరిందని ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. దీంతో పాటు 2.4 గ్రాముల బంగారం, 86 గ్రాముల వెండి, 40 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయన్నారు.


