అంబాజీపేట: జిల్లా తైక్వాండో పోటీల్లో అంబాజీపేట శ్రీనివాస తైక్వాండో క్లబ్ క్రీడాకారులు బంగారు, వెండి, కంచు పతకాలను కై వసం చేసుకున్నట్లు తైక్వాండో సీనియర్ కోచ్ పితాని త్రిమూర్తులు తెలిపారు. స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో క్రీడాకారులను పలువురు సోమవారం అభినందించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 32వ ఇంటర్ క్లబ్ తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీలను ఈ నెల 9న కాకినాడ జిల్లా స్పోర్ట్స్ స్టేడియంలో నిర్వహించారన్నారు. బాలుర, బాలికల సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, క్రెడిట్ విభాగాల్లో పోటీలు జరగాయన్నారు. ఈ పోటీల్లో 22 బంగారు పతకాలు, 14 వెండి, 12 కంచు పతకాలను క్రీడాకారులు కై వసం చేసుకున్నారని కోచ్ త్రిమూర్తులు, తైక్వాండో నేషనల్ రిఫరీ పితాని లక్ష్మీభార్గవిలు తెలిపారు. బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులు ఈ నెల 21 నుంచి 23 వరకు శ్రీకాకుళంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారన్నారు. వీరికి తర్ఫీదునిచ్చిన భార్గవితో పాటు కోచ్‌లు పి.నాగభూషణం, బి.కుసువీర్, పీవీ రాఘవేంద్రలను పలువురు అభినందనలు తెలిపారు.


