ఐ.పోలవరం మండలంలోని ప్రధాన కాలువ అయిన మురమళ్ల నుంచి కేశనకుర్రు, కేశనకుర్రుపాలెం ప్రాంతాలకు సైతం పూర్తి స్థాయిలో సాగునీరు అందడం లేదు. కేశనకుర్రు పంచాయతీ పరిధి చాకిరేవు చెరువు సమీపాన సుమారు 40 ఎకరాల్లో వరి పొలాలు నీరందక ఎండిపోతున్నాయి. పంటను కాపాడుకునేందుకు రైతులు బకెట్లతో నీళ్లు తీసుకుని వరి చేలను, నారును తడుపుకొంటున్న దుస్థితి. శివారు ప్రాంతాలైన జి.మూలపొలం, జి.వేమవరం, టి.కొత్తపల్లి గ్రామాల్లోని పొలాలకు కూడా సాగునీరు అందడం లేదు. ఖరీఫ్‌లో ఇటువంటి పరిస్థితి ఇంతకు ముందెప్పుడూ లేదని ఆవేదన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కాలువలకు నీరు విడుదల చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
– ఐ.పోలవరం


