రోత పలుకుపై ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

రోత పలుకుపై ఆగ్రహం

Apr 9 2026 8:05 AM | Updated on Apr 9 2026 8:05 AM

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాతలపై మండిపడిన

వైఎస్సార్‌ సీపీ శ్రేణులు

మహిళలను కించపరచడమే

ఆ మీడియా నైజమని ధ్వజం

ఆంధ్రజ్యోతి కార్యాలయం

ముట్టడికి యత్నం

గడియార స్తంభంలో

అడ్డుకున్న పోలీసులు

అమలాపురం హైస్కూల్‌ సెంటర్‌

వద్ద నిరసన

పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు

జగ్గిరెడ్డి, నియోజకవర్గ కోఆర్డినేటర్లు

సాక్షి, అమలాపురం/ అమలాపురం రూరల్‌: ‘కొత్త పలుకు పేరుతో.. మహిళల మీద చెత్త పలుకులు’ రాస్తున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌ సీపీ శ్రేణులు భారీ నిరసన చేపట్టారు. అమలాపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతికి.. ఆ సంస్థ ఎండీ రాధాకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ‘భార్యను చెల్లిగా అనుకుని మళ్లీ పెళ్లి చేయాలన్నంతగా దిగజారిన పచ్చ మీడియా.. మహిళలపై దారుణ వ్యాఖ్యలతో వికృత కథనాలపై ఏబీఎన్‌ రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి.. కొత్త పలుకుల పేరుతో చెత్తరాతలు’ అని ప్లకార్డులు ప్రదర్శించారు.

అడుగడుగునా అడ్డంకులు

ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా వైఎస్సార్‌ సీపీ ప్రజాస్వామ్యయుతంగా చేపట్టిన నిరసనకు పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. పట్టణ సీఐ వీరబాబు, ఇద్దరు ఎస్‌ఐలు, ఏఆర్‌ పార్టీల పోలీసులు మోహరించారు. గడియారస్తంభం సెంటరులో వేసిన టెంట్‌ను తొలగించడంతో పాటు స్థానిక హైస్కూల్‌ సెంటరు నుంచి ఆంధ్రజ్యోతి కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలను అడ్డుకుని వెనక్కు నెట్టివేశారు. ఈ సమయంలో అక్కడ తోపులాట చోటు చేసుకుంది.

గడియార స్తంభం సెంటర్‌లో నిరసనకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు భారీగా మోహరించి పార్టీ శ్రేణులను నిలువరించారు. ఈ సమయంలో పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరసనలో పాల్గొన్న మహిళా నాయకులు, కార్యకర్తలను కూడా నెట్టివేశారు. పోలీసుల తీరుపై పార్టీ నాయకులు మండిపడ్డారు. అంతకుముందు కోనసీమ నలుమూలల నుంచి వచ్చిన వైఎస్సార్‌ సీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు స్థానిక హైస్కూల్‌ సెంటర్‌ వద్ద నిరసనకు దిగారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీల నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, మహిళా నాయకుల ఆధ్వర్యంలో ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మహిళాలోకం సిగ్గుపడుతోంది : చిర్ల జగ్గిరెడ్డి

చంద్రబాబుకు తొత్తుగా మారి సభ్య సమాజం సిగ్గుపడేలా మహిళలను కించపరుస్తూ కథనాలు రాయడం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రమే చెల్లిందన్నారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలను మాత్రమే కాకుండా దేశంలో మహిళలంతా సిగ్గుపడేలా కథనాలు రాస్తున్నారని విమర్శించారు. జర్నలిజం ముసుగులో రాధాకృష్ణ బ్రోకరిజం చేసి కించపరిచే వ్యాఖ్యలు చేస్తే మహిళలంతా కలిసి రాధాకృష్ణ నాలిక కోసి కారం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. జీతాలు ఇవ్వడానికి సొమ్ములు లేవని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం రూ.రెండు లక్షలతో రాజధాని ఎలా నిర్మిస్తారని జగన్‌ ప్రశ్నించారు. రూ.20 వేల కోట్లతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి రాజధానిని నిర్మించవచ్చని జగన్‌ సలహా ఇచ్చారు. దీనిని రాష్ట్రంలో ఐదు కోట్ల మంది స్వాగతిస్తుంటే టీడీపీ, వారి అనుకూల మీడియా చేస్తున్న దుష్ప ప్రచారం చేస్తోందన్నారు.

ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ రావు మాట్లాడుతూ మావిగన్‌ ప్రతిపాదనపై చర్చించాలే తప్ప ఇలా తప్పుడు ప్రచారం చేయకూడదని హితవు పలికారు. బాధ్యతాయుతమైన మీడియాలో ఉన్నవారు మహిళలను కించపరచడం దారుణమన్నారు. పార్టీ రామచంద్రపురం కో ఆర్డినేటర్‌ పిల్లి సూర్య ప్రకాష్‌ మాట్లాడుతూ జర్నలిజం ముసుగులో తప్పులు చేస్తే మాత్రం నిరసన తెలుపుతామని, నిలదీస్తామన్నారు. పి.గన్నవరం కో ఆర్డినేటర్‌ గన్నవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ మావిగన్‌ ప్రతిపాదనకు ప్రజా మద్దతు వస్తుండడంతో తట్టుకోలేక రాధాకృష్ణ ఇలా నీచమైన విమర్శలకు దిగారన్నారు. రాజోలు కో ఆర్డినేటర్‌ పాముల రాజేశ్వరి దేవి మాట్లాడుతూ మహిళలను కించపరుస్తూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు చాలా సిగ్గు చేటన్నారు. మీడియా సంస్థల నీచమైన వ్యాఖ్యలు చూసి సభ్య సమాజం తలదించుకుంటోందని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి), ఎస్‌ఈసీ సభ్యులు కుడుపూడి భరత భూషణం, తోరం భాస్కరరావు, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, కటకంశెట్టి ఆదిత్యకుమార్‌, కర్రి నాగిరెడ్డి, పాటి శివకుమార్‌. పట్టణౖ వెఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు సంసాని చంద్రశేఖర్‌ (నాని), ఎంపీపీ యిళ్ల శేషారావు, మార్గని గంఽగధర్‌, జెడ్పీటీసీ పందిరి శ్రీహరి రామ్‌గోపాల్‌, కొనుకు గౌతమి, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రతినిధులు జిన్నూరి వెంకటేశ్వరరావు, మట్టపర్తి నాగేంద్ర, వంగా గిరిజకుమారి, షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌, కూరపరెడ్డి రాంబాబు, కాశీ రామకృష్ణ, తొరం గౌతమ్‌ రాజా, మిండగుదుటి శిరీష్‌, గొల్లపల్లి డేవిడ్‌ రాజు, చీకట్ల కిశోర్‌, పెమ్మిరెడ్డి మురళి, సూదా గణపతి, గుబ్బల మనోహర్‌, జిల్లెళ్ల రమేష్‌, ఉండ్రు వెంకటేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement