శుక్రవారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2026

Mar 13 2026 7:44 AM | Updated on Mar 13 2026 7:44 AM

జనం మదిలో

చెరగని ముద్ర

పి.గన్నవరం : వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావ వేడుకలు పి.గన్నవరంలో మండల పార్టీ అధ్యక్షుడు యన్నాబత్తుల ఆనంద్‌ ఆధ్వర్యంలో జరగగా వైఎస్సార్‌ సీపీ పి.గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్‌ గన్నవరపు శ్రీనివాసరావు, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు చింతలపాటి శ్రీనివాసరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గన్నవరపు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తన ఐదేళ్ల పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి, ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారన్నారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద గన్నవరపు పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. కేకును కట్‌ చేసి కార్యకర్తలకు పంచారు. స్థానిక అక్విడెక్టు వద్ద రాజశేఖరరెడ్డి, సెంటర్లో అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్థానిక సీహెచ్‌సీలో బాలింతలు, గర్భిణులకు పాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అయినవిల్లి, మామిడికుదురు, అంబాజీపేట మండలాల్లో కూడా పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిగాయి.

వైఎస్సార్‌కు నివాళులు

అమలాపురం : నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావ వేడుకలు అమలాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల సెంటరులో ఘనంగా జరిగాయి. నేతలు దివంగత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నియోజవర్గ పార్టీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ పినిపే శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎమ్మెల్సీలు కుడిపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్‌, మాజీ ఎంపీ, పార్టీ మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చింతా అనురాధ, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి బాబీలు కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు పంచారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డులు పంచి పెట్టారు. మున్సిపల్‌ చైర్మన్‌ రెడ్డి సత్యనాగేంద్రమణి, ఎస్‌ఈసీ సభ్యులు కుడుపూడి వెంకటేశ్వరరావు (బాబు), కుడుపూడి భరత్‌ భూషణ్‌, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్నాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement