చదువుతో పాటు క్రీడలకూ ప్రాధాన్యం
బ్యాడ్మింటన్ పోటీలో తలపడుతున్న క్రీడాకారిణులు
మాట్లాడుతున్న వీసీ డాక్టర్ చంద్రశేఖర్
రాజానగరం: విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకూ ప్రాధాన్యం ఇవ్వాలని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ అన్నారు. స్థానిక జీఎస్‌ఎల్ వైద్య కళాశాలలోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వుమెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 9 వరకూ జరిగే ఈ పోటీలకు దేశంలోని 94 యూనివర్సిటీల నుంచి 450 మంది క్రీడాకారిణులు, 120 మంది కోచ్‌లు, మేనేజర్లు హాజరయ్యారన్నారు.
బయోస్కిల్ ల్యాబ్ ప్రారంభం
వైద్య కళాశాలలోని అడ్వాన్స్‌డ్ బయోస్కిల్ ల్యాబ్‌ను డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ లాంఛనంగా ప్రారంభించారు. మృతదేహాల (కెడావర్స్)పై వైద్య విద్యార్థులు నేరుగా రోబోటిక్ సర్జరీలు సాధన చేసి, నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఈ ల్యాబ్ ఉపయోగపడుతుందని చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ గురునాథ్, అంతర్జాతీయ రిఫరీ పున్నయ్య చౌదరి, జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ సూర్య చరిష్మా తదితరులు పాల్గొన్నారు.
చదువుతో పాటు క్రీడలకూ ప్రాధాన్యం


