● మాయాసీత్రం
● అలా.. హిమదారిలో..
భోగి పండగ అంటే పిల్లలకు సందడే.. ఆ మంటలను చూసి వారికి సంబరమే.. అందుకే చిన్నారులు ఇప్పటి నుంచే భోగి మంటలకు దుంగలను సిద్ధం చేస్తూ, భోగి పిడకలు తయారు చేస్తూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం పల్లెల్లో ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యలే కనిపిస్తున్నారు. పెదపట్నంలంకలో చిన్నారులు ఇలా దుంగలను సేకరిస్తున్నారు.
– మామిడికుదురు
పచ్చని పొలాలు, పచ్చిక బయళ్లను పాల సముద్రం ముంచెత్తిందా అనేట్టు కనిపిస్తున్న ఈ చిత్రం కనువిందు చేస్తోంది. గొల్లపాలెంలో తెల్లవారే సమయంలో మంచు తెరలు ఇలా మాయ చేస్తున్నాయి. ఇళ్లు, పొలాలను సముద్రం ముంచెత్తినట్లు కనిపిస్తున్న ఈ దృశ్యం హిమసోయగమే.
– కాజులూరు
పోలవరం జిల్లా మన్యం మంచు దుప్పటిలో ఒదిగిపోతోంది.. ఓ వైపు చలి, మరోవైపు ఉదయం 9 గంటల వరకూ దట్టమైన పొగ మంచు కమ్మేస్తోంది. రాజవొమ్మంగిలో ఆది, సోమవారాల్లో 9 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటి పూట కూడా ఇలా లైట్లు వేసుకుని వాహనదారులు వెళ్లాల్సి వస్తోంది.
– రాజవొమ్మంగి
పెదపట్నంలంకలో భోగి మంటలకు
దుంగలను సిద్ధం చేస్తున్న చిన్నారులు
● మాయాసీత్రం
● మాయాసీత్రం


