నూతన ఏడాదిలో అందరికీ మేలు జరగాలి
కొత్తపేట/రావులపాలెం: నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మేలు జరగాలని, కొత్త కాంతులు విరబూయాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆకాంక్షించారు. గురువారం రావులపాలెం మండలం గోపాలపురంలో జగ్గిరెడ్డి ఇంట నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వ హించారు. కొత్తపేట నియోజకవర్గంతో పాటు జిల్లావాప్తంగా ఉన్న వైఎస్సార్ సీపీ శ్రేణులు గోపాలపురం తరలివచ్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి, పూల బొకేలు ఇచ్చి, శాలువాలతో సత్కరించి, కేక్‌లు కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ పాలనతో ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలన సాగించగా, నేటి చంద్రబాబు ప్రభుత్వం కేవలం పాలకుల సంక్షేమ పాలన సాగిస్తోందని విమర్శించారు. ఈ ఏడాది నుంచైనా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి రైతు సంక్షేమ, ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసి, ప్రజలకు మంచి జరిగేలా చర్యలు తీసుకోవాలని పాలకులకు హితవు పలికారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి


