
పుర వీధుల్లో మువ్వెన్నెల!
● 400 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ
● చైతన్యవంతంగా హర్ ఘర్ తిరంగా
అమలాపురం టౌన్: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం అమలాపురం వీధుల్లో 400 అడుగుల జాతీయ జెండాను విద్యార్థులు చేతపట్టి ఊరేగారు. బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ సాగింది. బీజేపీ పట్టణ అధ్యక్షుడు అయ్యల భాస్కరరావు ఆధ్వర్యంలో సాగిన ర్యాలీలో పార్టీ నాయకులు, వివిధ సంస్థల ప్రతినిధులు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. తొలుత వీరు సర్ సీవీ రామన్ స్కూలు ప్రాంగణంలో సమావేశమయ్యారు. అక్కడ నుంచి కలశం సెంటర్‌కు ప్రదర్శనగా వెళ్లారు. స్థానిక శుభ కలశం నుంచి 400 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన, ఊరేగింపు మొదలై గడియారం స్తంభం సెంటరు, హైస్కూలు సెంటర్ వరకూ సాగి తిరిగి సర్ సీవీ రామన్ స్కూలు ప్రాంగణానికి చేరింది. గడియారం స్తంభం సెంటరులోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండాల ప్రదర్శన జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీవేమా, హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ జోనల్ ఇన్‌చార్జి నల్లా పవన్‌కుమార్ ప్రసంగించారు. పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బోణం సత్య వరప్రసాద్, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సూదా గణపతి, బులియన్ అసోసియేషన్ అధ్యక్షుడు మేడిచర్ల త్రిమూర్తులు, చాంబర్ కార్యదర్శి కొమ్మూరి ప్రసాద్, సర్ సీవీ రామన్ స్కూలు డైరెక్టర్ రవణం వేణుగోపాలరావు, బీజేపీ నాయకులు చిట్టూరి రాజేశ్వరి, డీవీఎస్ రాజు, కొండేటి ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

పుర వీధుల్లో మువ్వెన్నెల!