
ఎల్‌ఆర్‌ఎస్‌పై గ్రామ సెక్రటరీలకు అవగాహన
అమలాపురం టౌన్: అమలాపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (అముడా) ఆధ్వర్యంలో అమలవుతున్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్)పై జిల్లాలోని పంచాయతీ సెక్రటరీలు అవగాహన పెంచుకోవాలని అముడా వైస్ చైర్‌పర్సన్, జేసీ టి.ని షాంతి సూచించారు. అమలాపురంలోని వాసర్ల గార్డెన్స్‌లో అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు అధ్యక్షతన జిల్లాలోని పంచాయతీ సెక్రటరీలతో మంగళ వారం జరిగిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. జిల్లాలో చాలా అనధికార లే అవుట్లు ఉన్నాయని, ఇందుకు పంచాయతీ సెక్రటరీలు విధుల సక్రమంగా నిర్వర్తించకపోవడమే కారణమన్నారు. ఇక నుంచి పంచాయతీ సెక్రటరీలు ఎల్‌ఆర్‌ఎస్ విషయంలో బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ప్లానింగ్ ఆఫీసర్ ఎ.సత్యమూర్తి, జిల్లా పంచాయతీ అధికారి డి.శాంతలక్ష్మి మాట్లాడారు. అముడా పరిధిలోకి వచ్చే 180 మంది పంచాయతీల సెక్రటరీలు పాల్గొన్నారు.