
క్రాస్ వెరిఫికేషన్ చేయాలి
అమలాపురం రూరల్: అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆధార్ మిస్ మ్యాచింగ్ క్రాస్ వెరిఫికేషన్ వంటి ఐదు రకాల అంశాల తనిఖీపై రెవెన్యూ వ్యవసాయ శాఖ సిబ్బంది చొరవ తీసుకుని మొదటి విడత నిధులు మంజూరుకు కృషిచేయాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం అమరావతి నుంచి రాష్ట్ర భూపరిపాలన ముఖ్య కమిషనర్ జయలక్ష్మి, కార్యదర్శి ఎన్.ప్రభాకర్‌రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అన్నదాత సుఖీభవ– పీఎం కిసాన్, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై జిల్లాల వారీగా సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విచారణ అధికారుల నుంచి పెండింగ్‌లో ఉన్న సాధారణ విచారణ నివేదికలను తెప్పించుకుని గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ టీ. నిషాంతీ, డీఆర్‌ఓ కే. మాధవి, ఆర్డీవోలు పీ. శ్రీకర్, డి. అఖిల, జిల్లా వ్యవసాయ అధికారి బోసు బాబు, సర్వే ఏడి కే ప్రభాకర్ పాల్గొన్నారు.
గడువులోగా లక్ష్య సాధన
జిల్లాస్థాయి అధికారులు ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల్లో గడువులోగా లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ మహేష్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆర్డీవోలు, తహసీల్దార్లు మండల సర్వేయర్లతో సమావేశం నిర్వహించి తల్లికి వందనం పెండింగ్ అంశాలు, షెడ్యూల్ కులాల వారికి బరియల్ గ్రౌండ్ కోసం స్థల సేకరణ, మండలాల వారీగా పట్టాదారు పాస్ పుస్తకాల వీఆర్వోల ద్వారా తనిఖీపై సమీక్షించారు.