
ఫైనల్స్ దశలో జాతీయ హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 15వ జాతీయ జూనియర్ మహిళల హాకీ పోటీలు ఆదివారం కాకినాడ డీఎస్‌ఏలో సెమీఫైనల్స్ పూర్తి చేసుకుని ఫైనల్స్‌కు చేరుకున్నాయి. సెమీఫైనల్స్‌లో రెండు మ్యాచ్‌లు నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన మ్యాచ్‌లను హాకీ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. మొదటి సెమీఫైనల్స్‌లో హర్యానా, ఛత్తీస్‌గఢ్ పోటీపడగా హర్యానా 3–0 స్కోర్‌తో విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. రెండో సెమీఫైనల్స్ జార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ మధ్య జరుగగా జార్ఖండ్ 3–0 స్కోర్‌తో గెలుపొంది ఫైనల్స్‌కు చేరింది. మూడోస్థానానికి మంగళవారం ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్ జట్లు పోటీ పడనున్నాయి. ఫైనల్స్ హర్యానా, జార్ఖండ్ జట్ల మధ్య నిర్వహించనున్నారు. క్రీడాకారులకు సోమవారం విశ్రాంతిరోజు. డీఎస్‌డీఓ బి.శ్రీనివాస్‌కుమార్, హాకీ సంఘ కార్యదర్శి హర్షవర్దన్, కోశాధికారి పి.థామస్, భవానీశంకర్, వి.రవిరాజు పోటీలను పర్యవేక్షించారు.