నులిమేద్దాం | - | Sakshi
Sakshi News home page

నులిమేద్దాం

Aug 11 2025 6:57 AM | Updated on Aug 11 2025 6:57 AM

నులిమ

నులిమేద్దాం

విజయవంతం చేయాలి

జిల్లా అవసరాలకు తగినంత ఆల్బెండజోల్‌ నిల్వలు ఉన్నాయి. విద్యార్థుల ఆరోగ్యాన్ని దష్టిలో ఉంచుకుని రూపొందించిన కార్యక్రమాన్ని విద్యా, వైద్య సిబ్బంది విజయవంతం చేయాలి. ఇప్పటికే టాబ్లెట్స్‌ జిల్లా కేంద్రం నుంచి పీహెచ్‌సీలకు సరఫరా అయ్యాయి.

– డాక్టర్‌ సుమలత, జిల్లా కోఆర్డినేటర్‌,

రాష్ట్రీయ బాల స్వచ్ఛ కార్యక్రమం,

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా.

రేపు డీ వార్మింగ్‌ డే

విద్య, వైద్య, ఆరోగ్య శాఖల

సంయుక్త కార్యాచరణ

జిల్లాకు చేరుకున్న 3.50 లక్షల

ఆల్బెండజోల్‌ మాత్రలు

రాయవరం: రాష్ట్రీయ బాల స్వచ్ఛ కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే)లో భాగంగా పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఏటా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో విద్యా ర్థులకు డీవార్మింగ్‌ డే (నులిపురుగుల నివారణ మందు వేయడం) నిర్వహిస్తున్నారు. ఏడాది వయసు ఉన్న చిన్నారుల నుంచి 19ఏళ్ల లోపు వారందరికీ నులి పురుగుల నివారణకు మందులు వేయనున్నారు. మూడేళ్ల నుంచి 19ఏళ్ల లోపు ఉన్న ఒక్కో విద్యార్థి 400 మిల్లీ గ్రాముల పరిమాణం గల ఆల్బెండజోల్‌ మాత్రలు చప్పరించాలి. ఒకటి నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 200 మిల్లీ గ్రాముల ట్యాబ్లెట్‌ను చప్పరించే విధంగా చూడాలి. లేదంటే పొడుం చేసి తాగించాలి. ఏడాది నుంచి రెండేళ్ల లోపు వారికి టాబ్లెట్‌లో సగభాగం మాత్రమే ఇవ్వాలి. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ముగిసిన వెంటనే విద్యార్థులతో మాత్రలు మింగించాల్సిన బాధ్యతను ఉపాధ్యాయులు, పీహెచ్‌సీ సిబ్బంది చేపట్టనున్నారు. ముందుగా ఉపాధ్యాయులు మాత్రలు చప్పరించి, విద్యార్థులతో కూడా చప్పరించే విధంగా చేయాలి. విద్యార్థులకు ఇచ్చే మాత్రలు నేరుగా మింగడం కాని, చప్పరించడం కాని చేసేలా చూడాల్సి ఉంటుంది. మాత్రలు వేసుకున్న వెంటనే వాంతులు, వికారం వచ్చినా కంగారు పడాల్సిన అవసరం లేదని, తాగునీటిని అందుబాటులో ఉంచుకోవాలని పీహెచ్‌సీ సిబ్బంది సూచిస్తున్నారు. డీవార్మింగ్‌ మాత్రలు విద్యార్థులతో చప్పరించడం వల్ల పోషకాహార లోపం వలన కలిగే రక్తహీనతను నివారించడానికి వీలవుతుంది. తద్వారా జీవనపరమైన, భౌతికమైన అభివృద్ధి, పిల్లల పెరుగుదలపై ప్రభావం చూపుతుంది.

పోస్టర్‌ ఆవిష్కరణ

డీ వార్మింగ్‌ డే సమర్థంగా అమలు చేసేలా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ దుర్గారావుదొర కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కలెక్టర్‌ డాక్టర్‌ మహేష్‌కుమార్‌ రావిరాల చేతుల మీదుగా పోస్టర్‌ను ఇటీవల ఆవిష్కరించారు.

ఈ నెల 20 వరకు మాపే అప్‌ ప్రోగ్రామ్‌

ఈ నెల 12న డీవార్మింగ్‌ డేను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ ద్వారా 3,50,709 ఆల్బెండ్‌జోల్‌ మాత్రలు 56 పీహెచ్‌సీలకు పంపిణీ చేశారు. జిల్లాలో ఉన్న 1,726 అంగన్‌వాడీ కేంద్రాల్లోని 78,339 మంది ఆరేళ్ల లోపు చిన్నారులకు 1,330 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లోని 29,770 మంది విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. 252 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 59,907 మంది విద్యార్థులకు, 480 ప్రైవేట్‌ పాఠశాలల్లోని 1,06,007 మంది విద్యార్థులకు డీ వార్మింగ్‌ టాబ్లెట్స్‌ అందించనున్నారు. ఐదు ప్రభుత్వ, 35 ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లోని మొదటి సంవత్సరం చదువుతున్న 4,109 మంది, 15 ఐటీఐ కళాశాలల్లోని 2,156 మంది, నాలుగు ఇంజినీరింగ్‌ కళాశాలల్లోని 1,829 మంది విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేయనున్నారు. ఈ నెల 20 వరకు మాపే అప్‌ ప్రోగ్రామ్‌ చేయాల్సి ఉంటుంది.

డీ వార్మింగ్‌ మాత్రలు వేసే సమయంలో..

● భోజనానికి ఒక గంట ముందు ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది విద్యార్థులకు, తల్లితండ్రులకు నులిపురుగులు వ్యాప్తి, నివారణ, ఆరోగ్య అలవాట్లు, ఆరోగ్యవిద్యపై అవగాహన కల్పించాలి.

● చేతులు శుభ్రపర్చుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత, సమతుల్య ఆహారంపై అవగాహన కల్పించాలి.

● పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తీసుకునేలా చూడాలి.

నులిమేద్దాం1
1/4

నులిమేద్దాం

నులిమేద్దాం2
2/4

నులిమేద్దాం

నులిమేద్దాం3
3/4

నులిమేద్దాం

నులిమేద్దాం4
4/4

నులిమేద్దాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement