
తలుపులమ్మ తల్లికి మకర తోరణం
తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ అమ్మవారికి మండపేటకు చెందిన శిల్పి వాసా శ్రీనివాస్ ఆదివారం రూ.1.25 లక్షల విలువైన మకరం తోరణం సమర్పించారు. ప్రత్యేక పూజల అనంతరం దాత కోరిక మేరకు దీనిని అమ్మవారికి అలంకరించామని ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. ఈ మకర తోరణాన్ని 8 కిలోల రాగి, ఇతర లోహాలతో తయారు చేశారన్నారు. దాతలను వేద పండితులు ఆశీర్వదించి, అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించారు.
లోవలో భక్తుల సందడి
తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానం ప్రాంగణంలో సందడి నెలకొంది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 18 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు ఈఓ విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ ప్రసాదం, పూజా టికెట్లు, వసతి గదులు తదితర రూపాల్లో దేవస్థానానికి రూ.5,00,279 ఆదాయం లభించిందని వివరించారు.