
ఘనంగా శ్రావణ పౌర్ణమి పూజలు
రాయవరం: మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో శనివారం శ్రావణ పౌర్ణమి పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రావణ, జంధ్యాల పౌర్ణమిని పురస్కరించుకుని పీఠంలోని విజయదుర్గా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి సహస్రనామాలతో అర్చన చేశా రు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తు లు పీఠంలో అమ్మవారి సన్నిధిలో సామూహిక కుంకుమపూజలు నిర్వహించారు. పీఠానికి వచ్చిన భక్తులను ఉద్దేశించి పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. అనంతరం పీఠంలోని భక్తులకు విజయదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా అన్న సమారాధన నిర్వహించారు.