సాగుకు పంటగెక్కడ! | - | Sakshi
Sakshi News home page

సాగుకు పంటగెక్కడ!

Aug 9 2025 7:37 AM | Updated on Aug 9 2025 7:37 AM

సాగుక

సాగుకు పంటగెక్కడ!

జిల్లాలో 2025–26లో మండలాల వారీగా ఖరీఫ్‌ సాగు

కనీస మద్దతు ధర లేక..

వరి ధాన్యానికి కేంద్రం ఇస్తున్న కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) గోదావరి డెల్టాలో గిట్టుబాటు కావడం లేదు. ధాన్యానికి కేంద్రం ఈ ఏడాది ప్రకటించిన ఎంఎస్‌పీ క్వింటాలుకు రూ.2,369గా ఉంది. రూ.మూడు వేలు ఉంటే పెట్టుబడులు వస్తే గొప్ప. మురుగునీటి పారుదల వ్యవస్థ మొత్తం దెబ్బతింది. తొలకరి సాగు అంటే జూదంగా మారిపోయింది. రెండో పంటకు నీరు అందడం గగనమైంది. సాగు సమ్మె తరువాత రైతులు డెల్టాలో తొలకరి సాగు చేయడం పెద్దఎత్తున మానేస్తున్నారు.

– కొవ్వూరి త్రినాథ్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ రైతు

విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రామచంద్రపురం

సాగు చేస్తే నష్టపోతున్నాం

నేను సుమారు పదెకరాల్లో వరి పండించేవాడిని. పదేళ్ల కిందటి వరకూ సార్వా, దాళ్వా పంటలతో పాటు అపరాలు వేసేవాడిని. ఇప్పుడు సాగు చేసే పరిస్థితి లేక సేద్యానికి స్వస్తి పలికాను. రాజోలు దీవిలో మురుగునీటి కాలువకు ఇరువైపులా ఆక్వా చెరువులు తవ్వేశారు. పంట కాలువలో సాగునీరు పారడం లేదు. మురుగునీటి కాలువల ద్వారా ముంపునీరు దిగే అవకాశం లేకుండా పోయింది. సాగు చేస్తే నష్టపోతున్నాం.

– వీరా గోపాలకృష్ణ,

ఉయ్యూరువారిమెరక, సఖినేటిపల్లి మండలం

సాక్షి, అమలాపురం: రైతు పండించిన పంట ఊరిలోకి రాగానే పండగ మొదలయ్యేది.. సార్వా చేతికి వచ్చిన తర్వాత వరసగా దసరా.. దీపావళి వస్తోంది. దాళ్వా ధాన్యం ఇళ్లకు చేరిన తర్వాత సంక్రాంతి పండగలతో ప్రతి గ్రామం కళకళలాడుతోంది. అటువంటిది ఇప్పుడు రైతు సాగుకు పూనుకోవడమే పండగ అయ్యింది. ఏడాదికి రెండు పంటలు వరి, మూడో పంట అపరాలతో సస్యశ్యామలంగా ఉండే డెల్టా భూముల్లో, ఇప్పుడు ఒక పంటే గగనం అవుతోంది. ప్రధాన పంట వరి పండినా గిట్టుబాటు కాకపోవడం, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోవడం వంటి కారణాలతో రైతులు ఆ సాగుకు దూరమవుతున్నారు. జిల్లాలో 2010లో వరి ఆయకట్టు 2,84,742 ఎకరాలు కాగా, ఇప్పుడు ఖరీఫ్‌లో సాగు లక్ష్యం కేవలం 1,63,399 ఎకరాలు మాత్రమే. అంటే సుమారు 1,21,343 ఎకరాల్లో వరి సాగు లేకుండా పోయింది. 2011లో జిల్లాలో జరిగిన సాగు సమ్మె తరువాత వరి సాగు గణనీయంగా తగ్గిపోతోంది. వరి చేలు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగా, ఉద్యాన పంటలుగా, ఆక్వా సాగుగా మారిపోతున్నాయి. మరికొన్ని చోట్ల రైతులు సాగు చేయకుండా వదిలేస్తున్నారు.

మూడొంతులు.. ముక్కచెక్కలు

2010 సమయంలో అల్లవరం డిస్ట్రిబ్యూటరీ కమిటీ (డీసీ) పరిధిలో అల్లవరం మండలం పూర్తిగా, ఉప్పలగుప్తం మండలం ఎస్‌.యానాం, గోపవరం, చల్లపల్లి, కిత్తనచెరువు, సరిపల్లి, అమలాపురం మండలం వన్నెచింతలపూడి, సమనస గ్రామాలున్నాయి. కాట్రేనికోన డీసీ పరిధిలో కాట్రేనికోన మండలంతో పాటు ఉప్పలగుప్తం మండలంలో మిగిలిన గ్రామాలున్నాయి. ఈ రెండు డీసీల పరిధిలో మొత్తం ఆయకట్టు 53,341 ఎకరాలు ఉంది. ఇప్పుడు వరి సాగు కేవలం 17,795 ఎకరాల్లో మాత్రమే జరుగుతోంది. వరి గిట్టుబాటు కాక రైతులు ఆక్వా సాగు వైపు వెళ్లిపోవడంతో మూడొంతుల సాగు కుదించుకుపోయింది.

మాయమై.. దూరమై..

మురమళ్ల, అయినవిల్లి పాత డిస్ట్రిబ్యూటరీ కమిటీల పరిధిలో 37,899 ఎకరాల ఆయకట్టు ఉండేది. ఇప్పుడున్న వరి ఆయకట్టు 21,150 మాత్రమే. ఇక్కడ పొలాలు ఆక్వా చెరువులుగా మారడంతోపాటు అయినవిల్లి, అంబాజీపేట వంటి ప్రాంతాల్లో భూములు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగా, కొబ్బరి తోటలుగా మారిపోయాయి. ఫలితంగా వరి సాగు దూరమైంది.

కొంచెం.. కొంచెంగా తగ్గుతూ..

తూర్పు డెల్టాలోని మండపేట, రామచంద్రపురం, సిరిపురం, ఎర్ర పోతవరం, ఆలమూరు, కోటిపల్లి డీసీల పరిధిలో మొత్తం 1,03,164 ఎకరాల ఆయకట్టు ఉండేది. ఇప్పుడు 91,584 ఎకరాలకు తగ్గిపోయింది. అంటే సుమారు 11,580 ఎకరాల ఆయకట్టు తగినట్టు అంచనా. మధ్య డెల్టాతో పోల్చుకుంటే వరి మానేసిన రైతులు ఇక్కడ తక్కువనే చెప్పాలి. ముంపు తీవ్రత తక్కువగా ఉండటం, అధిక దిగుబడులు రావడం వల్ల రైతులు ఇంకా వరి వైపే ఉన్నారు. అయితే కె.గంగవరం, రామచంద్రపురం రూరల్‌ వంటి ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఆక్వా పెరుగుతుండడం గమనార్హం.

ముందుకు కొనసాగులేక..

రాజోలు, పి.గన్నవరం డీసీల పరిధిలో 2010లో ఆయకట్టు మొత్తం 49,190 ఎకరాలు. కానీ ఇప్పుడు ఆయకట్టు ఎంతో తెలుసా? కేవలం 13,535 ఎకరాలు మాత్రమే. ఇందులో ఒక్క పి.గన్నవరం మండలంలోనే 6,284 ఎకరాలు కావడం విశేషం. అంటే మిగిలిన నాలుగు మండలాల్లో ఆయకట్టు 7,251 ఎకరాలే. ఇందులో మలికిపురం మండలంలో 793 ఎకరాలు, సఖినేటిపల్లి మండలంలో కేవలం 335 ఎకరాలు మాత్రమే. ఈ మండలంలో తొలకరి పంట సాగు చేసే రైతును అబ్బురంగా చూసే పరిస్థితి నెలకొంది.

2010లో మధ్య డెల్టా ఆయకట్టు

డీసీ పరిధి వరి ఆయకట్టు

(ఎకరాలు)

అల్లవరం 23,567

అవిడి 18,291

గోపాలపురం 11,141

కాట్రేనికోన 29,774

మురమళ్ల 22,216

అమలాపురం 17,390

అయినవిల్లి 15,683

పి.గన్నవరం 24,309

రాజోలు 23,129

మొత్తం ఆయకట్టు 1,81,578

తూర్పు డెల్టా (కోనసీమ జిల్లా పరిధిలో)

మండపేట 18,018

రామచంద్రపురం 19,679

సిరిపురం 20,284

యర్ర పోతవరం 18,753

ఆలమూరు 14,698

కోటిపల్లి 11,732

మొత్తం ఆయకట్టు 1,03,164

ఆత్రేయపురం 5,048

మండపేట 16,679

రాయవరం 14,667

రామచంద్రపురం 18,526

ఆలమూరు 9,947

రావులపాలెం 5,068

కొత్తపేట 7,833

కపిలేశ్వరపురం 16,052

కె.గంగవరం 15,713

ఐ.పోలవరం 5,811

ముమ్మిడివరం 5,293

అయినవిల్లి 8,291

పి.గన్నవరం 6,284

అంబాజీపేట 3,147

మామిడికుదురు 2,575

రాజోలు 3,548

మలికిపురం 793

సఖినేటిపల్లి 335

అల్లవరం 2,877

అమలాపురం 4,872

ఉప్పలగుప్తం 4,795

కాట్రేనికోన 5,251

ఫ తగ్గిపోతున్న వ్యవసాయం

ఫ జిల్లాలో 2.71 లక్షల

ఎకరాల ఆయకట్టు

ఫ ఖరీఫ్‌లో 1.63 లక్షల ఎకరాల్లోనే సాగు

ఫ గిట్టుబాటు కాక ముందుకు రాని రైతులు

ఫ ముంచేస్తున్న ఆక్వా,

మురుగునీటి కాలువలు

సాగుకు పంటగెక్కడ!1
1/5

సాగుకు పంటగెక్కడ!

సాగుకు పంటగెక్కడ!2
2/5

సాగుకు పంటగెక్కడ!

సాగుకు పంటగెక్కడ!3
3/5

సాగుకు పంటగెక్కడ!

సాగుకు పంటగెక్కడ!4
4/5

సాగుకు పంటగెక్కడ!

సాగుకు పంటగెక్కడ!5
5/5

సాగుకు పంటగెక్కడ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement