
లారీ బోల్తా పడి డ్రైవర్ మృతి
దేవరపల్లి: విశాఖపట్నం నుంచి కరీంనగర్ జిప్సమ్ లోడుతో వెళుతున్న లారీ దేవరపల్లి మండలం గొల్లగూడెం వద్ద ఎదురుగా వస్తున్న గూడ్స్ వాహనాన్ని ఢీ కొని అదుపుతప్పి రోడ్డు పక్కన గల చెరువులోకి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం తాడిగడప డొంకరోడ్డు, ఇందిరానగర్‌కు చెందిన లారీ డ్రైవర్ తాటిపర్తి శివనాగరాజు(29) లారీ క్యాబిన్‌లో చిక్కుకుని మృతి చెందాడు. స్థానికుల సహాయంతో డ్రైవర్ మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. డ్రైవర్ కుడి చెయ్యి తెగిపడింది. పోలీసుల కథనం ప్రకారం విశాఖపట్నం నుంచి కరీంనగర్‌కు జిప్సమ్(మట్టి) లోడుతో వెళుతున్న లారీ గురువారం తల్లాడ–దేవరపల్లి హైవేలో గోపాలపురం–దేవరపల్లి మధ్య గల గొల్లగూడెం మలుపు వద్ద ఎదురుగా వస్తున్న మరొక గూడ్స్ వాహనాన్ని వెనుకు పక్కన ఢీ కొంది. లారీ అతివేగంగా రావడంతో అదుపుతప్పి సమీపంలోని చెరువు గట్టున గల హెచ్‌టీ విద్యుత్ లైన్ స్తంభాన్ని ఢీ కొని బోల్తాపడింది. ఆ సమయంలో ఎదురుగా రోడ్డుపై ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో డ్రైవర్ శివనాగరాజు మృతి చెందినట్టు ఎస్సై వి.సుబ్రహమణ్యం తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గోపాలపురం ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

లారీ బోల్తా పడి డ్రైవర్ మృతి