
మామూళ్ల కోసం వేధింపులు
● మద్యం షాపులు మూసివేసి
వ్యాపారుల నిరసన
● ఎకై ్సజ్ కార్యాలయం వద్ద ధర్నా
అమలాపురం టౌన్: ప్రతి నెలా మూమూళ్లు ఇస్తున్నా.. అదనంగా పెంచాలని ఎకై ్సజ్ అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ అమలాపురం పట్టణ, రూరల్ మండలంలోని 13 లైసెన్స్ మద్యం షాపులను వ్యాపారులు సోమవారం మూసివేసి ఆందోళనకు దిగారు. షాపులకు తాళాలు వేసి, ఆ తాళాలను స్థానిక ఎకై ్సజ్ కార్యాలయంలో సీఐకి అందించి నిరసన తెలిపారు. ఇలాగైతే తాము వ్యాపారాలు చేయలేమని ఎకై ్సజ్ అధికారుల ముందే వ్యాపారులు అసహనం వ్యక్తం చేశారు. వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ వ్యాపారులు ఎకై ్సజ్ కార్యాలయం వద్ద ధర్నా కూడా చేశారు. మూమూళ్లు పెంచాలని, లేని పక్షంలో షాపులపై కేసులు నమోదు చేస్తామని వేధిస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకై ్సజ్ కార్యాలయంలో తొలుత సీఐ వీటీవీవీ సత్యనారాయణతో మద్యం వ్యాపారులు మాట్లాడారు. సీఐకి షాపుల తాళాలు ఇస్తూ, వ్యాపారాలు చేయలేమంటూ తెగేసి చెప్పారు. తర్వాత ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రసాద్‌తో భేటీ అయ్యారు. ఈ విషయమై ఎకై ్సజ్ సీఐ సత్యనారాయణను విలేకర్లు వివరణ కోరగా, వ్యాపారులకేదో సమస్య వచ్చిందని, అందుకే నిరసన తెలుపుతున్నారని, విషయం వారినే అడగాలన్నారు. మద్యం వ్యాపారులు కార్యాలయం ముందే ఆందోళనకు దిగడంతో అధికారులు కంగుతిన్నారు. వ్యాపారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసి, ఎట్టకేలకు ఆందోళనను విరమింపజేశారు. సోమ వారం సాయంత్రం నుంచి వ్యాపారులు షాపులను తెరవడంతో వివాదానికి తాత్కాలికంగా తెర పడింది. ఓ ప్రజాప్రతినిధి మద్యం షాపుల నుంచి మూ మూళ్ల కోసం డిమాండ్ చేస్తున్నారని తెలిసింది. మూమూళ్లు తారా స్థాయికి చేరడంతో మద్యం వ్యాపారులు నిరసన బాట పట్టారంటున్నారు.