
ఎంటీఎస్ ఉపాధ్యాయులకు జీతాల బట్వాడా
అమలాపురం టౌన్: వివిధ డిమాండ్లతో నిరసనకు దిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మినిమం టైమ్ స్కేల్ (ఎంటీఎస్) ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న జూన్, జూలై నెలల జీతాలు పడ్డాయి. ఎంటీఎస్ ఉపాధ్యాయుల సమస్యలపై ఇటీవల సాక్షిలో ప్రచురిమైన కథనానికి అధికారులు స్పందించి, తొలుత పెండింగ్‌లో ఉన్న వారి జీతాలను సోమవారం బట్వాడా చేశారు. ఎంటీఎస్ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ కేశవకుమార్ ఆనందం వ్యక్తం చేస్తూ, మిగిలిన సమస్యలపై కూడా విద్యా శాఖ స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో 122 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులకు 12 నెలలూ వేతనం ఇవ్వాలని, తమను 100 కిలోమీటర్లు పైబడి బదిలీలు చేయడం, కొందరిని ఏకోపాధ్యాయ పాఠశాలల్లో హెచ్‌ఎంలుగా బదిలీ చేసి, యాప్‌ల భారం మోపడం వంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
18 నుంచి ‘సామవేదం’ ప్రవచనాలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): సరస్వతీ గానసభ ఆధ్వర్యా న ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకూ సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ ప్రవచనాలు నిర్వహిస్తున్నారు. ‘సనాతన ధర్మం – శాశ్వత న్యా యం’ అనే అంశంపై స్థానిక సూర్య కళా మందిరంలో ఆయ న ప్రవచనం చేస్తారని నిర్వాహకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటలకు ఈ ప్రవచనాలు ప్రారంభమవుతాయన్నారు.