
జాతీయ విద్యా దినోత్సవానికి తొండవరం ప్రాజెక్ట్
అంబాజీపేట: జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఈ నెల 28 నుంచి 31 వరకు ఢిల్లీలోని ప్రగతి మైదానంలో జరిగే ప్రదర్శనకు తొండవరం ప్రాజెక్ట్ ఎంపికై ందని పాఠశాల హెచ్‌ఎం పి.కేశవాచార్యులు సోమవారం తెలిపారు. ఈ ప్రాజెక్లు మినిస్ట్రీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేటివ్ సెల్, ఏఐసీటీఏ ద్వారా జాతీయస్థాయికి సెలెక్ట్ అయి, 2024 సంవత్సరానికి ఏపీ నుంచి ఎంపికై న ఏకై క ప్రాజెక్టుగా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ పొందింది. స్థానిక హైస్కూల్ మెంటార్ కె.గణేష్ నరసింహారావు ఆధ్వర్యంలో స్టూడెంట్ శ్రీరామ్ తేజ్ తయారు చేసిన కార్బన్ డై యాకై ్సడ్ ఫిల్టర్‌ను ప్రగతి మైదానంలో ప్రదర్శిస్తారు. ఈ అవకాశం అందిపుచ్చుకోవడంలో సహకరించిన కలెక్టర్ మహేష్ కుమార్, డీఈఓ సలీం బాషా, డీఎస్‌ఓకు పాఠశాల తరఫున హెచ్‌ఎం కేశవాచార్యులు, గణేష్ నరసింహరావు కృతజ్ఞతలు తెలిపారు.
ఆషాఢం ఆదాయం అదుర్స్
తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం ఆదాయం రూ.1.56 కోట్లు లభించింది. అన్నవరం దేవస్థానం డిప్యూటీ కమిషనర్, సహాయ కార్యనిర్వహణాధికారి పి.బాబూరావు పర్యవేక్షణలో లోవ దేవస్థానం ఆవరణలో హుండీలను సోమవారం తెరిచారు. అమ్మవారి పంచలోహ విగ్రహాల ప్రాంగణంలో ఆదాయం లెక్కించారు. నోట్లు రూ.63,15,141, నాణేలు రూ.4,42,318 కలిపి మొత్తం రూ.67,57,459 సమకూరిందని ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు.