
228 అర్జీల స్వీకరణ
అమలాపురం రూరల్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా 228 అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ మాట్లాడుతూ గడువులోగా అర్జీలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టీ.నిషాంతి, డీఆర్‌ఓ రాజకుమారి, డ్వామా పీడీ మధుసూదన్, వికాస జల మేనేజర్ జి.రమేష్ పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 27 వినతులు
అమలాపురం టౌన్: ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 27 అర్జీలు వచ్చాయి. ఎస్పీ బి.కృష్ణారావు నిర్వహించిన ఈ గ్రీవెన్స్‌కు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు ఎస్పీ కార్యాలయాకి వచ్చి ఫిర్యాదు చేశారు. కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా ఉండడంతో ఎస్పీ అర్జీదారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

228 అర్జీల స్వీకరణ