
విద్యార్థులతో శ్రీషిర్డీసాయి విద్యాసంస్థల చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో శ్రీషిర్డీసాయి విద్యానికేతన్ రాజమహేంద్రవరం, కడియం విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించినట్లు విద్యాసంస్థల డైరెక్టర్ టి. శ్రీవిద్య తెలిపారు. తమ లక్ష్య ఓరియంటేషన్‌తో 10 వ తరగతి చదివిన వి. ఉదయ రుషిత 600 మార్కులకు 593 సాధించి ప్రథమ స్థానంలో నిలువగా ఎన్.సాయి అక్షయ, బి.యశశ్విని 592 మార్కులు, ఎం. జాహ్నవి, ఎస్. దేవికృష్ణసిరి 591, ఎ. లోహిత్ కుమార్ 590 మార్కులు సాధించినట్లు వివరించారు. ఆరుగురు విద్యార్థులు 590కి పైగా మార్కులు సాధించగా, 24 మంది 580 మార్కులకు పైగా, 44 మంది 570కి పైగా మార్కులు, 75 మంది 550కి పైగా మార్కులు సాధించారు. హాజరైన మొత్తం164 మంది విద్యార్థులు ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయినట్లు తెలిపారు. విద్యార్థులను, ఉపాధ్యాయ బృందాన్ని శ్రీ షిర్డీసాయి విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, లక్ష్య అకాడమీ డీన్ కె. శ్రీనివాస్ అభినందించారు.