నిరంతర కృషి, పర్యవేక్షణతోనే.. | - | Sakshi
Sakshi News home page

నిరంతర కృషి, పర్యవేక్షణతోనే..

Apr 23 2024 8:10 AM | Updated on Apr 23 2024 8:10 AM

పదవ తరగతిలో మంచి ఫలితాలు నిరంతర కృషి, పర్యవేక్షణతోనే సాధించగలిగాం. ప్రధానోపాధ్యాయులతో పాటు సబ్జెక్టు ఉపాధ్యాయులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలతో పాటు విద్యార్థుల్లో అభ్యసనాలను మెరుగుపర్చడంతోనే ఈ ఫలితాలను సాధించగలిగాం. పది ఫెయిల్‌ అయిన విద్యార్థులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. సప్లిమెంటరీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రణాళికాబద్ధంగా చదివి మంచి ఫలితాలను సాధించుకోవాలి.

– జి.నాగమణి, ఆర్‌జేడీ, పాఠశాల విద్యాశాఖ, అమలాపురం

సంతృప్తికర ఫలితాలు

పది ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయి. రాష్ట్రంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా నాలుగవ స్థానంలో నిలిచింది. గతేడాది కంటే తొమ్మిది స్థానాలు ముందుకు వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు ప్రత్యేక తరగతులు, నిత్యం పరీక్షల నిర్వహణతోనే ఈ ఫలితాలు సాధించాం. ఈ విజయంలో భాగస్వాములైన హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు అభినందనలు.

– ఎం.కమలకుమారి, డీఈవో, అమలాపురం

స్ఫూర్తిదాయకమైన ఫలితాలు

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు స్ఫూర్తిదాయకమైన ఫలితాలను సాధించారు. ఇదే ఒరవడిని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు మున్ముందు కూడా కొనసాగించాలి. ఈ ఫలితాలను స్ఫూర్తిగా తీసుకుని వచ్చే సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలి. ఉపాధ్యాయులు పడ్డ కష్టానికి మంచి ఫలితాలు వచ్చాయి. – నక్కా సురేష్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌, ప్రభుత్వ పరీక్షల విభాగం, అమలాపురం

22ఎండీపీ121ఎ:

22ఎండీపీ121బి:

22ఎండీపీ121సి:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement