నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు 13 నామినేషన్లు | - | Sakshi
Sakshi News home page

నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు 13 నామినేషన్లు

Apr 20 2024 3:20 AM | Updated on Apr 20 2024 3:20 AM

రెండోరోజు పార్లమెంట్‌ నియోజకవర్గానికి నిల్‌

అమలాపురం రూరల్‌: అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి రెండోరోజు నామినేషను బోణీ కాలేదు. నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు 13 నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌ సీపీ తరుపుప పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌ మూడు సెట్లు, పొన్నాడ నీరజ ఒక సెట్‌ నామినేషన్‌ వేశారు. కాంగ్రెస్‌ నుంచి పాలెపు ధర్మారావు ఒక సెట్‌ సత్తిరాజు ఎస్‌వీయువీఆర్‌ఎస్‌ స్వామి బిరా రాజ్‌కుమార్‌ ఇండిపెండెంట్లుగా ఒక సెట్‌ చప్పున ఓక సెట్‌ నామినేషన్‌ వేశారు. రామచంద్రపురం నియోజకవర్గం నుంచి బహుజన సమాజ్‌ పార్టీ తరఫున మతా సుబ్రహ్మణ్యం ఒక సెట్‌, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నుంచి జుట్టుక వెంకటరావు ఒక సెట్‌ నామినేషన్‌ వేశారు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా అయితాబత్తుల ఆనందరావు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మండపేట నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా మందపల్లి రవి, నవతరం పార్టీ నుంచి నందికోళ్ల రాజు ఒక సెట్‌ నామినేషన్లు దాఖలు చేశారు.

పవన్‌ది రాజకీయంలోనూ నటనే

ఏపీ అగ్రి మిషన్‌ సభ్యుడు బాబి

అమలాపురం టౌన్‌: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ ఇంతకాలం సినిమాల్లో మాత్రమే నటిస్తారనుకున్నాం. ఆయన రాజకీయాల్లోనూ నటిస్తారని ఆయన స్థిరత్వంలేని మాటలే తేటతెల్లం చేస్తున్నాయని ఏపీ అగ్రిమిషన్‌ సభ్యుడు జిన్నూరి రామారావు (బాబి) అన్నారు. అమలాపురంలో బాబి స్థానిక మీడియాతో శుక్రవారం మాట్లాడారు. గతంలో టీడీపీ, బీజేపీని, ప్రధానమంత్రి మోదీ, చంద్రబాబు, లోకేష్‌లపై ఎన్నో ఆరోపణలు చేసిన పవన్‌ కళ్యాణ్‌ ఆ నోటితోనే నేడు ఇంద్రుడు, చంద్రుడు అంటూ వారిని పొగడ్తలతో ముంచెత్తుతున్న తీరు సినిమాల్లోని ఆయన నటనను ప్రజలకు గుర్తుకు చేస్తోందని బాబి అన్నారు. వైఎస్సార్‌ సీపీ ఉభయ గోదావరి జిల్లాల కో ఆర్డినేటర్‌, ఎంపీ పి.మిధున్‌రెడ్డిని గోదావరి జిల్లాలో ఆయన పెత్తనం ఏమిటి? అని ప్రశ్నిస్తున్న పవన్‌కళ్యాణ్‌ నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో చదువుకున్నానని చెప్పే ఆయనకు పిఠాపురంతో పనేంటని బాబి ఎదురు ప్రశ్న వేశారు. గోదావరి జిల్లాల పార్టీ కో ఆర్డినేటర్‌గా వైఎస్సార్‌ సీపీని పర్యవేక్షిస్తున్న మిధున్‌రెడ్డిని పవన్‌ కళ్యాణ్‌కి విమర్శించే అర్హత లేదని చెప్పారు. పావలా పవన్‌ అంటూ తిట్టిన టీడీపీతోనే అంటకాగుతున్న నీ రాజకీయ పరిణితిపై ప్రజలు చర్చించుకుంటున్నారని బాబి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement