
మలికిపురంలో రాజేశ్వరరావు స్వాగతం పలికిన అభ్యర్థి గొల్లపల్లి, నాయకులు కేఎస్‌ఎన్ రాజు
● జనసేన నుంచి వైఎస్సార్ సీపీలో చేరిన బొంతు రాజేశ్వరరావు
● మలికిపురంలో ఘన స్వాగతం
మలికిపురం: రాష్ట్రంలో జగన్‌కు వ్యతిరేకంగా కూటమి సాగిస్తున్న రాజకీయం ఓ పెద్ద బోగస్ వ్యవహారమని జనసేన నుంచి వైఎస్సార్ సీపీలో చేరిన బొంతు రాజేశ్వరరావు పేర్కొన్నారు. తణుకులో బుధవారం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన ఆయన పార్టీ నాయకులు కేఎస్‌ఎన్ రాజు ఆధ్వర్యంలో మలికిపురంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఏదో సేవ చేద్దామని జనసేనలోకి వెళితే అక్కడ అంతా చంద్రబాబు ఆధ్వర్యంలో వచ్చే ఎన్నికల్లో ప్రజలను దోచేద్దామన్న కార్యక్రమానికి కార్యాచరణ రూపొందుతోందని అన్నారు. దీంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని అన్నారు. రాజోలు నియోజకవర్గంలోనే టీడీపీ, జనసేన కేడర్‌కు ప్రణాళిక ఏమీ లేదని, ఇక ప్రజలకు వారు ఏం చేస్తారని అనుమానం వచ్చి బయటకు వచ్చేశానని రాజేశ్వరరావు అన్నారు. వచ్చే ఎన్నికలలో మరోసారి జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు కృషి చేస్తానని అన్నారు. అమలాపురం ఎంపీగా రాపాక వర ప్రసాదరావు, రాజోలు ఎమ్మెల్యేగా గొల్లపల్లి సూర్యారావు గెలుస్తారని అన్నారు. పీకే రావు, సూరిశెట్టి బాబి, కొల్లాబత్తుల కుమార్ పాల్గొన్నారు.