
రావులపాలెం సెంటర్‌లో జనవాహినికి
అభివాదం చేస్తున్న సీఎం జగన్
జననేత చూసేందుకు తోసుకుంటూ
ముందుకు..
అదిగదిగో జగనన్న
నవరత్నాలతో తమ బతుకుల్లో వెలుగులు
పొదిగిన జగన్మోహనుడి రాక జనానికి ఏరువాకే అయింది. భగభగ మండే వేసవి ఎండలు గుండెల్లో ఉప్పొంగే అభిమానాన్ని ఏమీ చేయలేకపోయాయి. మేమంతా సిద్ధం బస్సుయాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించింది మొదలు జనం బ్రహ్మరథం పట్టారు. బాణసంచా కాల్చారు. అడుగడుగునా హారతులు ఇచ్చారు. పూలజల్లులు కురిపించారు. గజమాలలతో స్వాగతించారు. తమ నాయకుడి అభివాదానికి ప్రత్యభివాదంగా రెండు చేతులు ఊపుతూ కేరింతలు కొట్టారు. చిరునవ్వులు చిందించే జగనన్న మోమును తమ సెల్‌ఫోన్లలో బంధించి మురిసిపోయారు. పార్టీ జెండాలే తోరణాలుగా, ఫ్లెక్సీలే స్వాగత ద్వారాలుగా దారిపొడవునా వెల్లువెత్తిన
అభిమానంతో బస్సుయాత్ర జాతరను తలపించింది.

బారులు తీరి.. చెంతకు చేరి..

జనవాహిని కేరింతలు

మేడలెక్కిన అభిమానం

జై జగన్.. జైజై జగన్..

అన్నను చూసిన ఆనందం

జగన్నాథ అభివాదం

రాజమహేంద్రవరంలో ధన్వంతరీల ధన్యవాదాలు

ఎండను లెక్క చేయకుండా.. జెండాలు చేతబట్టి..