చదువు పేరుతో హైదరాబాద్‌లో సహజీవనం.. ఇంటికి వచ్చాక మాట మార్చిన మహేష్‌

Young Woman Lover Cheating Suicide Attempt Thungathurthy Suryapet - Sakshi

తుంగతుర్తి (సూర్యాపేట): ప్రేమ పేరుతో ప్రియుడు వంచించాడని యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నారం గ్రామానికి చెందిన వెలిశాల ఉమారాణి,  అదే గ్రామానికి చెందిన ఉప్పుల మహేష్‌  కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.  చదువు పేరుతో ఇద్దరు హైదరాబాద్‌లో ఉండి సహజీవనం చేశారు. ఇటీవల ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని స్వగ్రామానికి వచ్చారు.  

కులాలు వేరు కావడంతో మహేష్‌ కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. ఈ విషయాన్ని మహేష్‌ ప్రియురాలైన ఉమారాణికి చెప్పడంతో పంచాయితీ పెద్ద మనుషుల వద్దకు చేరింది. దీంతో ఉమారాణిని పెళ్లిచేసుకుంటానని మహేష్‌ ఒప్పకున్నాడు. అనంతరం తాను పెళ్లి చేసుకోనని చెప్పడంతో ఉమారాణి తుంగతుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు మహేష్‌ను పిలిపించి కౌన్సిలింగ్‌ నిర్వహించగా పెళ్లి చేసుకుంటానిని ఒప్పుకొని స్వగ్రామానికి వెళ్లిపోయాడు. 
చదవండి👉ఉత్తరాఖండ్‌లో దారుణం.. కదులుతున్న కారులో తల్లీ, కూతురిపై సామూహిక అత్యాచారం

మరొకరితో పెళ్లికి యత్నిస్తున్నారని..
మహేష్‌ తల్లిదండ్రులు అతడికి వేరే అమ్మాయితో పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నారనే విషయం తెలియడంతో ఉమారాణి శనివారం  సాయంత్రం తిరిగి పెద్ద మనుషులను ఆశ్రయించింది. దీంతో కొంత మంది పెద్ద మనుషులు ఉమారాణిని నువ్వు ఒంటరిగా పోరాటం చేయలేవు.. మహేష్‌ తల్లీదండ్రుల నుంచి రూ.10లక్షలు ఇప్పిస్తాము ఊరుకోమని సలహా ఇచ్చారు. 

కానీ ఉమారాణి వినడకుండా మరికొంత మంది పెద్ద మనుషులతో  పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు మహేష్‌ను స్టేషన్‌కు పిలిపించి ఇరువురికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఈ క్రమంలో మహేష్, ఉమారాణిలు పెళ్లికి ఒప్పకున్నారు. అనంతరం పెద్ద మనుషుల సమక్షంలో  లగ్నపత్రికను  రాసుకున్నారు. తిరిగి ఇంటికి వెళ్లాకా మహేష్‌ మళ్లీ మాట మార్చి ఉమారాణికి ఫోన్‌ చేసి నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పాడు. దీంతో ఉమారాణి మనస్తాపానికి గురై శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఊరివేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. 

గమనించిన ఉమారాణి తల్లి కేకలు వేయడంతో చుట్టూ పక్కలవారు వచ్చి ఆమెను కాపాడారు. అప్పటికే ఉమారాణి స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను  చికిత్స నిమి త్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉమారాణి తండ్రి వెలిశాల సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు మహేష్‌తోపాటు అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ డానియేల్‌కుమార్‌ తెలిపారు.
చదవండి👉ఇష్టం లేని పెళ్లి.. పిల్లలు పుట్టడానికి మందు అని చెప్పి, ప్రియుడితో కలిసి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top