ప్రేమ పేరుతో నిలువునా మోసం  | Young Woman Committed Suicide After Her Lover Refused To Marry Her | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో నిలువునా మోసం 

Oct 12 2022 8:19 AM | Updated on Oct 12 2022 9:53 AM

Young Woman Committed Suicide After Her Lover Refused To Marry Her - Sakshi

శ్రీనివాసపురం: ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకుంటాననడంతో అతని వెంట వెళ్లింది. తీరా పెళ్లిక నిరాకరించడంతో మానసిక వ్యథకు గురైన యువతి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ముళబాగిలు తాలూకా ఎన్‌ కురుబరహళ్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన పాపలమ్మ కుమార్తె వెన్నెల (22) అనే యువతి ఎన్‌ జంగాలపల్లి గ్రామానికి చెందిన అంజప్ప కుమారుడు చంద్రశేఖర్‌ ప్రేమలో పడ్డారు.

కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ ఇల్లు విడిచి వెళ్లారు. తల్లిదండ్రులు పోలీసుల సహకారంతో వారిని మళ్లీ తీసుకొచ్చారు. పోలీసుల సమక్షంలో పంచాయతీ చేయగా, వెన్నెలను పెళ్లి చేసుకోనని ప్రియుడు చెప్పాడు. మోసపోయానన్న ఆవేదనతో వెన్నెల ఇల్లు విడిచి వెళ్లిపోయింది. చివరికి గ్రామ సమీపంలోని ఓ బావిలో ఆమె శవమై తేలింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా చంద్రశేఖర్, అతని తల్లిదండ్రులు పరారయ్యారు. నంగలి పోలీస్‌ స్టేషన్‌లో వీరిపై కేసు నమోదైంది.  

(చదవండి: కర్ణాటకలో దళితులపై అరాచకం..15 రోజుల పాటు చిత్రహింసలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement