కడతేరిన ‘ఫేస్‌బుక్’‌ ప్రేమ  | Young Woman Commits Suicide In Chittoor District | Sakshi
Sakshi News home page

కడతేరిన ‘ఫేస్‌బుక్’‌ ప్రేమ 

Mar 11 2021 7:20 AM | Updated on Mar 11 2021 9:15 AM

Young Woman Commits Suicide In Chittoor District - Sakshi

పుత్తూరు పట్టణానికి చెందిన బాలచంద్ర(30) అనే వ్యక్తి గుంటూరు నగరానికి చెందిన సౌజన్యతో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమయ్యాడు. రెండేళ్ల పా టు ఫేస్‌బుక్‌ ద్వారా ప్రేమను పంచుకున్న వారు పెద్దలను కాదని ఏడాదిన్న క్రితం వివాహం చేసుకున్నారు.

పుత్తూరు రూరల్(చిత్తూరు జిల్లా)‌: ఫేస్‌బుక్‌ పరిచయం ప్రేమ ఆ తరువాత పెళ్లికి దారి తీసింది. ఆమె ఆశలు ఏడాదిన్నరలోపే కడతేరాయి. సౌజన్య(27) అనే యువతి తన ఇంట్లోనే ఉరి వేసుకొన్న సంఘటన బుధవారం పుత్తూరులో జరిగింది. ఎస్‌ఐ రామాంజనేయులు కథనం మేరకు.. పుత్తూరు పట్టణానికి చెందిన బాలచంద్ర(30) అనే వ్యక్తి గుంటూరు నగరానికి చెందిన సౌజన్యతో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమయ్యాడు. రెండేళ్ల పాటు ఫేస్‌బుక్‌ ద్వారా ప్రేమను పంచుకున్న వారు పెద్దలను కాదని ఏడాదిన్న క్రితం వివాహం చేసుకున్నారు.

ఇద్దరూ కలిసి స్థానిక మండపం వీధిలో కాపురం పెట్టారు. బాలచంద్ర పుత్తూరులోని మాత్ర ఫార్మసీలో పనిచేసేవాడు. గత కొంత కాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సౌజన్య బుధవారం ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందింది. గుంటూరులోని మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. వారు పుత్తూరుకు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు సేకరించి, కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
చదవండి:
సైబర్‌ వల: రిటైర్డు డీజీపీకే మస్కా  
భర్తను చంపేసి, ఇంట్లోనే పూడ్చిపెట్టిన భార్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement