కూతుర్ని ప్రేమిస్తున్నాడని పొలంలోనే ఉరి వేశాడు | Young Person Lost Life By Lover Father In Karnataka | Sakshi
Sakshi News home page

కూతుర్ని ప్రేమిస్తున్నాడని పొలంలోనే ఉరి వేశాడు

Jul 29 2021 6:59 AM | Updated on Jul 30 2021 6:14 PM

Young Person Lost Life By Lover Father In Karnataka - Sakshi

గంగావతి: తన కూతుర్ని ప్రేమిస్తున్నాడనే కోపంతో ఆమె తండ్రి యువకున్ని పొలంలో ఉరివేసి చంపాడు. కొప్పళ జిల్లా సంగాపురం గ్రామంలో బుధవారం ఈ ఘోరం జరిగింది. సంగాపుర గ్రామానికి చెందిన యువకుడు హనుమేష్‌ (22) గ్రామంలో కూలీ పనులు చేస్తుంటారు. ఇతడు ఒక యువతిని ప్రేమిస్తున్నట్లు చెప్పుకునేవాడు. ఇది తెలిసిన యువతి తండ్రి కసితో రగిలిపోయాడు. పని ఉందని యువకున్ని వారి పొలానికి పిలిపించి కొట్టి చెట్టుకు ఉరివేశాడు. ఇందుకు యువతి తల్లి కూడా సహకరించినట్లు యువకుని అన్న పరుశురాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంగావతి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement