
సాక్షి, హైదరాబాద్: ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి యువకులు ఇలా అందిరినీ ఆకస్మిక గుండెపోటు కలవరానికి గురిచేస్తోంది. తాజాగా ఓ యువకుడు బ్యాండ్మింటన్ ఆడుతుండగా గుండెపోటుకు గురయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది.
నాగోల్ స్టేడియంలో బ్యాండ్మింటన్ ఆడుతున్న గుండ్ల రాకేష్ అనే యువకుడు(25).. గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి వ్యక్తులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే యువకుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతడు రాకేష్ ఖమ్మం జిల్లా తల్లాడ వాసిగా గుర్తించారు. కాగా అతడు ప్రైవేట్ కంపెనీలోని ఉద్యోగం చేస్తున్నట్లు తేలింది.
