అక్కాచెల్లెళ్లకు వర్జినిటీ టెస్ట్‌..ఒకరు పాస్‌ మరొకరు ఫెయిల్‌

Woman Fails Virginity Test Both Sisters Faces Divorce Order In Maharashtra - Sakshi

వర్జినిటీ టెస్ట్‌లో ఫెయిల్‌.. విడాకులకు ఆదేశం

ముంబై :  వర్జినిటీ(కన్యత్వ) పరీక్షలో విఫలమయ్యిందని నవ వధువులిద్దరిని పుట్టింటికి పంపించిన అమానవీయఘటన మహారాష్ష్ర్టలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కొల్లాపూర్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లకు అదే గ్రామానికి చెందిన అన్నాతమ్ముళ్లతో నవంబర్‌ 27న పెళ్లి జరిపించారు. అయితే తొలిరాత్రి తర్వాత వధువు శీలవతా? కాదా అని తెలుసుకోవడానికి ఇద్దరు అక్కాచెల్లెళ్లకు కన్యత్వ పరీక్షను నిర్వహించారు. ఇందులో ఒకరు మాత్రమే ఉత్తీర్ణులు కాగా, మరొక వధువుకి ఎలాంటి రక్తస్రావం కాలేదు. దీంతో ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లను పుట్టింటికి పంపించేశారు. ఈ పెళ్లిని తక్షణమే రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించడమే కాకుండా,  10 లక్షల రూపాయలను ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేశారు.

ఈ అంశంపై అమ్మాయి తల్లిదండ్రులు జాత్ పంచాయతీ వారిని సంప్రదించగా అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైంది. కులంలోని కట్టబాట్ల ప్రకారం వర్జినిటీ పరీక్షలో యువతి విఫలమయిందని, దీంతో ఆమెకు ఇదివరకే ఎవరితోనో సంబంధం ఉందని పంచాయతీ పెద్దలు ఆరోపించారు. అంతేకాకుండా ఆ కుటుంబాన్ని కులం నుంచి వెలివేస్తున్నామని తీర్పుచెప్పారు. కాగా మహారాష్ట్రలో ఎక్కువగా కనిపించే కంజర్భట్ వర్గంలో ఇలాంటివి ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఈ వర్గంలోని ప్రతి మహిళ పెళ్లైన రోజున ఈ పరీక్ష ఎదుర్కోవాల్సిందే. అది కూడా గ్రామ పంచాయతీ పర్యవేక్షణలోనే జరగడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంపై అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి : బలవంతంగా ఫోటోలు.. ఆపై వాట్సాప్‌.. కట్‌చేస్తే!
ప్రేమ వ్యవహారం: కొద్ది రోజుల్లో పెళ్లి.. యువతి తల నరికి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top