దారుణానికి పాల్పడ్డ మొదటి భార్య | Woman Assassinate Stepchildren In Nalgonda District | Sakshi
Sakshi News home page

సవతి పిల్లల్ని హత్య చేసిన మొదటి భార్య

Dec 10 2020 9:18 PM | Updated on Dec 10 2020 9:46 PM

Woman Assassinate Stepchildren In Nalgonda District - Sakshi

సాక్షి, నల్లగొండ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి తగాదాల నేపధ్యంలో సవతి పిల్లల్ని హత్య చేసి, తాను ఆత్మహత్యకు పాల్పడింది ఓ మహిళ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణానికి చెందిన ప్రదీప్‌ కొన్నేళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ప్రదీప్‌, శాంతి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, ఇటీవల ప్రదీప్‌కు, మొదటి భార్యకు ఆస్తి తగాదాలు తలెత్తాయి.

దీంతో రెండో భార్య కుటుంబంపై కక్ష కట్టుకున్న ఆమె.. గురువారం శాంతికి పుట్టిన ఇద్దరు పిల్లల్ని హత్య చేసి, అనంతరం అదే ఇంట్లో ఆమె ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కొరకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement