ముసుగు ఆగంతకుడెవరు? | Who is the masked person? | Sakshi
Sakshi News home page

ముసుగు ఆగంతకుడెవరు?

Apr 8 2023 2:11 PM | Updated on Apr 8 2023 2:17 PM

Who is the masked person? - Sakshi

ముసుగు వేసుకున్న వ్యక్తి ఎవరనేది ప్రస్తుతం ఈప్రాంతంలో హాట్‌ టాపిక్‌గా మారింది.

వరంగల్: ఈనెల 1న ఏటూరునాగారం మండల కేంద్రంలో మావోయిస్టుల పేరుతో వెలిసిన పోస్టర్లను ఒక అపరచిత వ్యక్తి వేసినట్లు గుర్తించిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించారు. ఇందులో ఓ ముసుగు వేసుకొని కాలు కుంటుతున్న వ్యక్తి ఉండడాన్ని గమనించారు. పోలీసులు ఆ వీడియోలను సమీప ప్రాంతాల ప్రజలకు చూపించి గుర్తుపట్టాలని కోరారు.

దీంతో ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి ఎవరనేది ప్రస్తుతం ఈప్రాంతంలో హాట్‌ టాపిక్‌గా మారింది. స్థానిక సీఐ రాజు, ఎస్సై రమేశ్, మంగపేట ఎస్సై తహేర్‌బాబా అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరించి కూపీ లాగుతున్నారు. అయితే ముసుగు వేసుకున్న వ్యక్తితో మరెవరైనా ఈపని చేయించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement