స్నానం చేస్తున్న అమ్మాయిల ఫోటోలు తీసి.. | Vikarabad Man Threats To Women To Leak Bathing Photos | Sakshi
Sakshi News home page

స్నానం చేస్తున్న అమ్మాయిల ఫోటోలు తీసి..

Nov 5 2020 8:52 PM | Updated on Nov 5 2020 9:02 PM

Vikarabad Man Threats To Women To Leak Bathing Photos - Sakshi

సాక్షి, వికారాబాద్‌ : జిల్లాలోని కులకచర్ల మండలం  లాల్ సింగ్ తండాలో దారుణం చోటుచేసుకుంది. స్నానం చేస్తున్న అమ్మాయిలు, వివాహిత ఫోటోలను తీసి ఓ కామాంధుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. నగ్న పోటోలు బయటపెడతానంటూ బ్లాక్‌మెయిల్‌‌ చేసి లోబర్చుకుంటున్నాడు. అనంతరం ఆ ప్రైవేట్‌ వీడియోలను స్నేహితులకు పంపి పైశాచికానందం పొందుతున్నాడు. ఓ మహిళా బాధితురాలి ఫిర్యాదు మేరకు గత నెల 18న శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే నాలుగు రోజుల క్రితం బెయిల్‌పై తిరిగి వచ్చిన శ్రీనివాస్‌, అతని సోదరుడితో కలిసి బాధితురాలి కుటుంబ సభ్యులపై దాడికి దిగాడు. అంతటి ఆగకుండా తిరికి వారిపైనే అక్రమ కేసులు పెట్టించారు. శ్రీనివాస్‌ను పోలీసులకు అండగా నిలుస్తున్నారని మహిళా బాధితురాలు ఆరోపించారు. శ్రీనివాస్‌పై  కాగా ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. శ్రీనివాస్ వల్ల గ్రామంలో అశాంతి నెలకొందని, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు లంచం తీసుకొని నిందితులకు వత్తాసు పలుకుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement