మహిళలను వేధించారు.. నడిరోడ్డుపై.. | Video: Two Held For Harassing Women In MP Squats On Busy Road | Sakshi
Sakshi News home page

మహిళలను వేధించారు.. నడిరోడ్డుపై..

Nov 22 2020 12:07 PM | Updated on Nov 22 2020 12:23 PM

Video: Two Held For Harassing Women In MP Squats On Busy Road - Sakshi

భోపాల్‌: మహిళలను లైంగికంగా వేధించిన ఇద్దరు వ్యక్తులకు మధ్యప్రదేశ్‌ పోలీసులు తగిన విధంగా బుద్ధి చెప్పారు. నిత్యం రద్దీగా ఉండే దేవాస్‌లోని ఒక వీధిలో.. రోడ్డు మధ్యలో నిందితులిద్దరినీ కూర్చోబెట్టి, చెవులు పట్టుకొని గుంజిళ్లు తీయించారు. మధ్యప్రదేశ్‌ పోలీసులు పోస్ట్‌ చేసిన ఈ వీడియోలో.. ఓ మహిళా పోలీస్‌ వీరిని లాఠీతో కొట్టడం కూడా కనిపించింది.  (భార్య నగ్న వీడియోలు యూట్యూబ్‌లో..)

కాగా.. వార్షిక నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) 2019 నివేదిక ప్రకారం.. భారతదేశంలో మహిళలపై నేరాలు 2018 నుంచి 2019 వరకు 7.3 శాతం పెరిగాయి. ఇదే కాలంలో షెడ్యూల్డ్‌ కులాలపై నేరాలు కూడా 7.3 శాతం పెరిగాయి. దేశంలో మహిళలపై నేరాలలో మధ్యప్రదేశ్‌ ఆరోస్థానంలో ఉంది. గత సంవత్సరం రాష్ట్రంలో 27,560 కేసులు నమోదయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement