వివాహమై ఏడాది కాకముందే.. భార్యభర్తలు

Two Wheeler Accident Tragedy In Tamilnadu - Sakshi

సాక్షి, తిరువళ్లూరు(తమిళనాడు): రోడ్డు ప్రమాదంలో గాయపడిన దంపతులు మృతిచెందారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరుకు చెందిన శరవణన్‌(39), నివేద(37) దంపతులు ఈ నెల 8వ తేదీ ద్విచక్ర వాహనంపై తిరుత్తణికి వెళుతున్నారు. పట్రపెరంబదూరు వద్ద వెనుక నుంచి లారీ ఢీకొనడంతో గాయపడ్డారు.

తిరువళ్లూరులో ప్రథమ చిక్సిత అనంతరం చెన్నై రాజీవ్‌గాంధీ వైద్యశాలకు తరలించారు. ఈ నెల 10న నివేద మృతి చెందగా, శనివారం శరవణన్‌ మృతి చెందాడు. వివాహమై ఏడాది కాకముందే భార్యభర్తలు కన్నుమూయడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. తాలుకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top