లిఫ్ట్‌ అడిగి ప్రాణాలు పోగొట్టుకున్న డిగ్రీ విద్యార్థి | 2 Killed In Single-Vehicle Road Accident In Gajwel - Sakshi
Sakshi News home page

లిఫ్ట్‌ అడిగి ప్రాణాలు పోగొట్టుకున్న డిగ్రీ విద్యార్థి

Feb 22 2024 7:04 PM | Updated on Feb 22 2024 7:16 PM

Two Died in Road Accident - Sakshi

అరుణ్‌ (ఫైల్‌) అయాన్‌ (ఫైల్‌)

గజ్వేల్‌రూరల్‌: పుస్తకాలు కొనుక్కుందామని బయలుదేరిన ఇద్దరు మిత్రులు మార్గమధ్యలో ఓ యువకుడిని లిఫ్ట్‌ అడిగారు. కొద్దిదూరం వెళ్లగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. దీంతో వాహనం నడుపుతున్న యువకుడితో పాటు మరొకరు మృతి చెందారు. ఈ సంఘటన బుధవారం గజ్వేల్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దౌల్తాబాద్‌ మండలం శేరుపల్లి బందారం గ్రామానికి చెందిన శ్రీను, మంజుల దంపతుల చిన్నకొడుకు అరుణ్‌(20), రామాయంపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన దేవయ్య–మమత దంపతుల రెండో కుమారుడు దిలీప్‌ గజ్వేల్‌లోని బీసీ హాస్టల్‌లో ఉంటూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.

వీరిద్దరు మంచి స్నేహితులు. సెమిస్టర్‌ పరీక్షలు దగ్గర పడుతుండటంతో పుస్తకాలను కొనుగోలు చేసేందుకు బుధవారం ఉదయం హాస్టల్‌ నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో గజ్వేల్‌కు చెందిన అయాన్‌(19) సంగాపూర్‌ నుంచి గజ్వేల్‌ వైపు స్కూటీపై వెళ్తున్నాడు. ఇదే సమయంలో అరుణ్, దిలీప్‌లు లిఫ్ట్‌ అడగడంతో అయాన్‌ వారిని స్కూటీపై ఎక్కించుకొని బయలుదేరాడు. మార్గమధ్యలో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. దీంతో ప్రమాదస్థలిలోనే అరుణ్‌ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అయాన్‌ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ తీసుకెళుతుండగా మార్గమధ్యలో ప్రాణాలొది లాడు. దిలీప్‌ను నిమ్స్‌కు తరలించారు. గజ్వేల్‌ ఏసీపీ బాలాజీ ఘటనాస్థలాన్ని పరిశీలించారు.  

లిఫ్ట్‌ ఇవ్వడమే శాపమైందా..?: కుటుంబీకులు 
అయాన్‌ మదర్సాలో విద్యనభ్యసించి నాలుగు నెలల క్రితమే పట్టణంలోని ఓ బట్టల దుకాణంలో చేరాడు. లిఫ్ట్‌ ఇవ్వడమే శాపమైందా అంటూ అయాన్‌ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. చేతికందిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడటంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.  

పోలీసై వస్తాడనుకున్నా..  అరుణ్‌ తల్లి మంజుల
ఇయ్యాల పొద్దునే తండ్రితో ఫోన్‌లో మాట్లాడిండు. మంచిగ సదువుకుంటున్న.. పోలీసు కొలువు సాధించి కష్టాలు తీరుస్తానన్నాడు. ఇప్పుడు మాకు దూరమయ్యావా బిడ్డా అంటూ అరుణ్‌ తల్లి మంజుల రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. అరుణ్‌ మరణ వార్తతో స్నేహితులు, కుటుంబ సభ్యులంతా దుఃఖసాగరంలో మునిగిపోయారు.  

 చురుకైన విద్యార్థి  
అరుణ్‌ చదువులో చురుకైన విద్యారి్థ. ఇటీవలే ఎన్‌సీసీకి సంబంధించిన ఎగ్జామ్‌–బీ ఉత్తీర్ణుడయ్యాడు. చదువులో ముందుంటూ ఎన్‌సీసీలో చురుకుగా పాల్గొనే అరుణ్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరం.  
ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌రెడ్డి,ఎన్‌సీసీ లెఫ్టినెంట్‌ డాక్టర్‌ భవానీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement