‘పాలమూరు’ సొరంగంలో ప్రమాదం

Tractor Driver Passed Away While Working At Palamuru Rangareddy Project - Sakshi

కందనూలు (నాగర్‌కర్నూల్‌): పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల సొరంగం పనుల్లో రాయి కూలి ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృతి చెందాడు. నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ సమీపంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సొరంగం పనులు కొంతకాలంగా జరుగుతున్నాయి. ఉయ్యాలవాడకు చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ గొంది శ్రీనివాస్‌రెడ్డి ఎప్పటిలాగే నీళ్ల ట్రాక్టర్‌ తీసుకుని, మరో నలుగురు కూలీలతో కలిసి బుధవారం ఉదయం లోపలికి వెళ్లాడు.

సొరంగంలో 400మీటర్ల మేర చేరుకోగానే పైకప్పు నుంచి రాళ్లు విరిగి పడటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంట ఉన్నవారు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మిగిలిన నలుగురు కూలీలు సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్‌ హెల్మెట్‌ లేకుండానే ట్రాక్టర్‌తో లోపలికి వెళ్లినట్టు తెలిసింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top