ఇంటికి గడియ పెట్టి.. కిరోసిన్‌ చల్లి  | Thugs Set Up Fire On House With Kerosene In Bhupalpally District | Sakshi
Sakshi News home page

ఇంటికి గడియ పెట్టి.. కిరోసిన్‌ చల్లి 

Published Fri, Mar 4 2022 4:31 AM | Last Updated on Fri, Mar 4 2022 4:31 AM

Thugs Set Up Fire On House With Kerosene In Bhupalpally District - Sakshi

కాటారం: ఓ కుటుంబం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కొందరు దుండగులు ఇంటికి గడియ పెట్టి రెండు గుమ్మాలపై కిరోసిన్‌ చల్లి నిప్పు పెట్టి సజీవ దహనానికి యత్నించారు. ఈ సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చింతకానిలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకానిలో దూలం రవి అనే యువకుడు తన తల్లిదండ్రులు దూలం రాజయ్య, రాజేశ్వరిలతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్నాడు.

అర్ధరాత్రి సమయంలో గాఢనిద్రలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి రెండు గుమ్మాలకు గడియ పెట్టి వెంట తీసుకొచ్చిన కిరోసిన్‌ చల్లి నిప్పంటించారు. మంటల వేడి గమనించిన కుటుంబ సభ్యులు ఇంటి వెనకాల గుమ్మంనుంచి బయటికొచ్చారు. వెంటనే మంటలు ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. ఇంటినుంచి బయటికి వస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు పరుగెత్తడాన్ని గమనించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమను సజీవ దహనం చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. బాధిత కుటుంబ స భ్యులు పలువురిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement