నాగార్జున సాగర్‌లో ముగ్గురు యువకుల గల్లంతు | Three Youths Missing In Nagarjuna Sagar | Sakshi
Sakshi News home page

నాగార్జున సాగర్‌లో ముగ్గురు యువకుల గల్లంతు

Feb 9 2023 9:21 PM | Updated on Feb 9 2023 9:22 PM

Three Youths Missing In Nagarjuna Sagar - Sakshi

హైదరాబాద్‌ నుంచి విహార యాత్రకు వచ్చిన ముగ్గురు యువకులు నాగార్జున సాగర్‌లో గల్లంతయ్యారు. 

సాక్షి, నల్లగొండ: హైదరాబాద్‌ నుంచి విహార యాత్రకు వచ్చిన ముగ్గురు యువకులు నాగార్జున సాగర్‌లో గల్లంతయ్యారు. శివాలయం పుష్కర ఘాట్ వద్ద ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

గల్లంతైన వారిని చంద్రకాంత్ (20), నాగరాజు(39), వాచస్పతి(26)గా గుర్తించారు. గల్లంతైన వారిలో ఇద్దరు నల్గొండ వాసులు కాగా, మరొకరు హాలియకు చెందిన వ్యక్తి. ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కన్నీరుమున్నీరుగా కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.
చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement