మెకానిక్‌లమని చెప్పి అంబులెన్స్ అపహరణ

సాక్షి, ఇల్లెందు/గుండాల: తాము మెకానిక్‌లమని చెప్పి 102 అంబులెన్స్ డ్రైవర్ నుంచి తాళాలు తీసుకుని ట్రయిల్ వేస్తామంటూ ఉడాయించారు. వెంటనే సమాచారం అందించగా, పోలీ సులు వెంబడించారు. దీంతో ఇల్లెందు వద్ద వదిలి పారిపోయారు. ఈ సంఘటన మండలంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక ప్రభుత్వాసుపత్రి పరిధిలో తిరిగే 102 అంబులెన్స్‌ను రిపేరు చేయాలని ముగ్గురు గుర్తు తెలియ ని వ్యక్తులు కారులో వచ్చి ట్రయల్ వేస్తామని తాళాలు తీసుకున్నారు.
ఓ వ్యక్తి అంబులెన్స్‌ను తీసుకుని వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత మిగిలిన ఇద్దరు కూడా వెళ్లిపోయారు. ఎంతసేపటికీ రాకపోవడంతో అనుమానం వచ్చిన డ్రైవర్ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పాడు. వెంటనే కాచనపల్లి, ఇల్లెందు పోలీసులకు సమాచారం అందించారు. కాచనపల్లి నుంచి అంబులెన్స్‌ను వెంబడించగా ఇల్లెందు దగ్గర వదిలి పారిపోయాడు. వెంటనే పోలీసులు 102 వాహనాన్ని ఆస్పత్రి సిబ్బందికి అప్పగించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి