పెళ్లిలో దొంగతనం.. దంపతులకు దేహశుద్ధి | Theft In Marriage At Kamareddy | Sakshi
Sakshi News home page

పెళ్లికి వచ్చి మంగళసూత్రం దొంగిలించారు

Nov 24 2020 10:50 AM | Updated on Nov 24 2020 12:06 PM

Theft In Marriage At Kamareddy - Sakshi

సాక్షి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్ హాల్లో జరిగిన పెళ్లిలో సినీ ఫక్కీలో ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి వచ్చిన దంపతులు పెళ్లి కుమార్తె బంధువులకు సంబంధించిన మూడు తులాల బంగారాన్ని దొంగిలించారు. పెళ్లికి హాజరైన వారు ఆ దంపతులు బంగారం దొంగిలించడాన్ని గమనించి వారిని పట్టుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరి వద్ద వెతకగా మూడు తులాల బంగారం బయటపడింది. దీంతో స్థానికులు వారికి దేహశుద్ధి చేశారు.. అనంతరం పోలీసులకు అప్పగించారు. బంగారాన్ని దొంగిలించిన దంపతులు ఇందిరానగర్ కాలనీకి చెందిన పరమేశ్, యశోదలుగా గుర్తించారు. ఈ మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement