వైఎస్సార్‌సీపీ నేతపై టీడీపీ వర్గీయుల దాడి  | TDP Activists Attacked YSRCP Leader in Anantapur District | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేతపై టీడీపీ వర్గీయుల దాడి 

Jan 16 2021 6:43 AM | Updated on Jan 16 2021 6:45 AM

TDP Activists Attacked YSRCP Leader in Anantapur District - Sakshi

గాయపడిన ఫరూక్‌

గుత్తి (అనంతపురం జిల్లా): పట్టణంలోని కమాటం వీధికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత, 11వ వార్డు మున్సిపల్‌ కౌన్సిలర్‌ అభ్యర్థి ఫరూక్‌పై టీడీపీ వర్గీయులు శుక్రవారం దాడి చేశారు. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఫరూక్‌ సోదరుడు అన్వర్‌ సీఎస్‌ఐ చర్చివద్ద ఉండగా కోట వీధికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు కె.ఎస్‌.ఉమర్, కుమారుడు మైను, అల్లుడు జబీర్, కార్యకర్తలు రామకృష్ణ (రాంకీ), సాదిక్, ఫయాజ్, ఏజస్, సయ్యద్, సాబాజ్, ఇర్ఫాన్, కరీమ్, విజయ్, రసూల్‌ మరో ఐదుగురు గొడవ పెట్టుకున్నారు. సర్దిచెప్పేందుకు వెళ్లిన ఫరూక్‌పై టీడీపీ వర్గీయులంతా రాళ్లు, కట్టెలతో విచక్షణారహితంగా దాడిచేశారు.

తీవ్రంగా గాయపడ్డ ఫరూక్‌కు స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. ఫరూక్‌పై దాడిచేసిన 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి గురుప్రసాద్‌ యాదవ్, బీసీ సెల్‌ జిల్లా నాయకులు వాల్మీకి శివ, వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ నాయకుడు బుస్సా సుధీర్‌రెడ్డి తదితరులు డిమాండ్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement