
స్టూడెంట్ వీసా మీద భారత్‌కు వచ్చిన డానియల్ చదువుతూనే డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసుల గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి 6 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
సాక్షి, హైదరాబాద్: సిటీ యువతను టార్గెట్ చేసుకుని విదేశీయులు కొందరు డ్రగ్స్ దందాకు తెరలేపారు. హైదరాబాద్‌లోని వెస్ట్ జోన్ పరిధిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. లంగర్‌హౌజ్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియా వ్యక్తిని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్టూడెంట్ వీసా మీద భారత్‌కు వచ్చిన డానియల్ చదువుతూనే డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసుల గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి 6 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
(చదవండి: తెలంగాణకు సినీ ప్రముఖుల విరాళాలు)