లైంగిక వేధింపులు: ‘నన్ను క్షమించండి.. నాకు బతకాలని ఉంది.. కానీ’ | Tamil Nadu Karur: 17 Year Old Girl Hangs Herself Due To Harassment | Sakshi
Sakshi News home page

‘లైంగిక వేధింపులకు బలయ్యే అమ్మాయిల్లో నేనే చివరి దాన్ని కావాలి.. నన్ను క్షమించండి’

Nov 20 2021 6:02 PM | Updated on Nov 20 2021 6:43 PM

Tamil Nadu Karur: 17 Year Old Girl Hangs Herself Due To Harassment - Sakshi

చెన్నై: మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు ఎన్ని కఠిన చర్యలు తీసుకొచ్చినా ఫలితం శూన్యంగా మారుతోంది. చిన్న పిల్లలపై, మైనర్లపై జరిగే లైంగిక నేరాల నియంత్రణకు పోక్సో వంటి చట్టం కామాంధుల చర్యల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. తాజాగా లైంగిక వేధింపులకు మరో బాలిక ప్రాణం బలైపోయింది. ఇప్పటికే భర్తను పొగొట్టుకున్న ఆ తల్లికి కూతురి ఆత్మహత్య తీవ్ర కడుపుకోతను మిగిల్చింది. ఈ దారుణమైన ఘటన తమిళనాడులో కరూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది.
చదవండి: మాజీ మిస్‌ కేరళ, రన్నరప్‌ మృతి: ఆడి కారులో వెంటాడి మరీ

ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న 17 ఏళ్ల బాలిక శుక్రవారం సాయంత్రం కళాశాల నుంచి ఇంటికి వచ్చింది. ఆ సమయంలో తల్లి ఇంట్లో లేకపోవడంతో ఒంటరిగా ఉన్న మైనర్‌ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే బాలిక ఎంత సేపటికీ బయటకు రాకపోవడాన్ని గమనించిన పక్కనున్న వృద్ధురాలు ఇంట్లోకి వెళ్లి చూడగా.. బాలిక ఉరేసుకొని కనిపించింది. దీంతో షాక్‌ తిన్న ఆమె వెంటనే బాలిక తల్లికి సమాచారమిచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.
చదవండి: వివాహేతర సంబంధం: నమ్మించి లాడ్జికి తీసుకువెళ్లి..

బాలిక మృతదేహం పక్కన రాసిన సుసైడ్‌ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లైంగిక వేధింపులతోనే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు బాధితురాలు లేఖలో పేర్కొంది.‘ కరూర్‌ జిల్లాలో లైంగిక వేధింపులకు బలయ్యే అమ్మాయిల్లో నేనే చివరి దాన్ని కావాలి. నా ఈ కఠిన నిర్ణయానికి కారణమైన వారి గురించి చెప్పేందుకు భయంగా ఉంది. నాకు ఇంకా చాలా కాలం బతకాలని ఉంది. ఇతరకు సాయం చేయాలని ఉంది. కానీ చాలా త్వరగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోతున్నాను. నా కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను. ఈ తీవ్రమైన చర్య తీసుకున్నందుకు నన్ను క్షమించండి’ అని కోరింది.

కాగా మరోవైపు తమిళనాడులో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం రెండు వారాల వ్యవధిలో ఇది రెండో ఘటన. గత వారం కోయంబత్తూరుకు చెందిన 17 ఏళ్ల బాలిక పాఠశాల టీచర్‌ లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపిస్తూ  ఆత్మహత్యకు పాల్పడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement