సుశాంత్ కేసు: రియా నోరు విప్పుతుందా? | Sushant Singh Rajput Case: Rhea Chakraborty Reach ED Office | Sakshi
Sakshi News home page

ఈడీ కార్యాల‌యానికి చేరుకున్న రియా

Aug 10 2020 2:23 PM | Updated on Aug 10 2020 4:07 PM

Sushant Singh Rajput Case: Rhea Chakraborty Reach ED Office - Sakshi

ఈసారైనా రియా చ‌క్ర‌వ‌ర్తి స‌రైన స‌మాధానాలు చెప్తుందా? లేదా?

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం నేప‌థ్యంలో మ‌నీలాండ‌రింగ్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రియా సోమ‌వారం రెండోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ఎదుట‌ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. త‌న సోద‌రుడు సౌవిక్ చ‌క్ర‌వ‌ర్తితో క‌లిసి ఆమె ముంబైలోని ఈడీ కార్యాల‌యానికి చేరుకున్నారు. సుశాంత్‌కు చెందిన కోట్లాది రూపాయ‌ల‌ను అక్ర‌మంగా దారి మ‌ళ్లించిన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రియాపై ఈడీ అధికారులు మ‌రోసారి ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. కాగా జూన్ 14న ముంబైలోని త‌న నివాసంలో సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. (రియా చక్రవర్తిపై సంచలన ఆరోపణలు చేసిన లాయర్‌)

సుశాంత్ నుంచి నీళ్ల బాటిల్‌, లెట‌ర్ మాత్ర‌మే అందుకున్నా
ఆయ‌న మ‌ర‌ణంపై సందేహాలు వ్య‌క్తం చేస్తూ సుశాంత్ తండ్రి రియా స‌హా, ఆమె కుటుంబ స‌భ్యులు, మ‌రికొంత‌మందిపై పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు సుశాంత్ అకౌంట్ నుంచి రూ.15 కోట్లు ట్రాన్స్‌ఫ‌ర్ అయిన‌ట్లు గుర్తించారు. దీంతో ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా శుక్ర‌వారం రియాను ఈడీ ఎనిమిది గంట‌ల పాటు ప్ర‌శ్నించిన‌ప్ప‌టికీ సంతృప్తిక‌ర స్థాయిలో స‌మాధానాలు రాలేవు. కేవ‌లం ఓ వాట‌ర్ బాటిల్‌, లెట‌ర్ మాత్ర‌మే సుశాంత్ నుంచి తీసుకున్నాన్నానంటూ ఆమె అనేక ప్ర‌శ్న‌ల‌కు దాట‌వేసే స‌మాధానాలిచ్చారు. (ఈడీ ముందుకు రియా: అరెస్ట్ చేస్తారా?)

రియా త‌మ్ముడిని 18 గంట‌ల పాటు విచారించిన ఈడీ
దీంతో మ‌రోసారి విచార‌ణ‌కు రావాల‌ని ఈడీ ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో నేడు ఆమె మ‌ళ్లీ ఈడీ కార్యాల‌యానికి వ‌చ్చింది. ఈసారైనా అధికారులు అడిగే ప్ర‌శ్న‌ల‌కు రియా స‌రైన స‌మాధానాలు చెప్తుందో లేదో చూడాలి. మ‌రోవైపు శ‌నివారం ఆమె సోదరుడిని ఈడీ 18 గంట‌ల పాటు విచారించింది. శ‌నివారం మ‌ధ్యాహ్న ప్రాంతంలో ఈడీ కార్యాల‌యానికి వెళ్లిన షోవిక్ ఆదివారం ఉద‌యం 6.30 నిమిషాల‌కు బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ఇదిలా వుండ‌గా సీబీఐ ద‌ర్యాప్తును ఆపివేయాలంటూ రియా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే. ఈ కేసు మంగ‌ళ‌వారం విచార‌ణ‌కు రానుంది. (సుశాంత్ నుంచి తీసుకున్న ఆస్తి ఇదే : రియా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement