పొరపాటున.. దారుణ హత్య  | Superi Gang killing Innocent Person In Karnataka | Sakshi
Sakshi News home page

పొరపాటున.. దారుణ హత్య 

Oct 19 2021 7:18 AM | Updated on Oct 19 2021 7:19 AM

Superi Gang killing Innocent Person In Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, శివమొగ్గ(కర్ణాటక): పాతకక్షలతో ఒక వ్యక్తిని చంపాలని ప్రత్యర్థులు పథకం వేశారు. ఆ సమయంలో ఆ వ్యక్తి రాకపోగా అక్కడికి వచ్చిన సంతోష్‌ (32) అనే మరో అమాయకున్ని ప్రాణాలు తీశారు. శివమొగ్గ నగరంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాపూజీ  నగర లేఔట్‌లో ఆయుధ పూజ అయిన గురువారం రాత్రి నలుగురు దుండగులు కాపుకాశారు.

ఒకరు అవెంజర్‌ బైకులో వస్తాడని, అతన్ని వేసేయాలని దుండగులకు సుపారీ ఇచ్చిన వ్యక్తి చెప్పాడు. ఆ సమయంలో  సంతోష్‌ స్నేహితుని ఇంట్లో భోజనం చేసి సమీపంలో ఉన్న బైక్‌ వద్దకు వెళ్తుండగా హంతకులు చూశారు. తాము చంపాల్సిన వ్యక్తి ఇతడేననుకుని కత్తులతో హత్యచేసి పరారయ్యారు. విచారణ జరిపిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement