సీబీఐ కస్టడీకి సునీల్‌కుమార్‌ యాదవ్‌

Sunil Kumar Yadav In CBI Custody - Sakshi

సునీల్‌ యాదవ్‌ను పులివెందుల తీసుకెళ్లి విచారిస్తున్న సీబీఐ

రోటరీపురం రోడ్డులో అనుమానాస్పద ప్రదేశాల్లో సీబీఐ తనిఖీలు

సాక్షి, కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయి, కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న సునీల్‌కుమార్‌ యాదవ్‌ను సీబీఐ అధికారులు 10 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. సునీల్‌ యాదవ్‌ను పులివెందుల తీసుకెళ్లి  సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. రోటరీపురం రోడ్డులో అనుమానాస్పద ప్రదేశాల్లో సీబీఐ తనిఖీలు చేస్తోంది.

కాగా, అతడిని తదుపరి విచారణ నిమిత్తం ఈ నెల 16 వరకు సీబీఐకి అప్పగిస్తూ శుక్రవారం పులివెందుల మేజిస్ట్రేట్‌ అనుమతించిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం 5.15 గంటలకు కడప కేంద్ర కారాగారం నుంచి సునీల్‌కుమార్‌ యాదవ్‌ను సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కేంద్ర కారాగారం ఆవరణలోని గెస్ట్‌హౌస్‌లో సీబీఐ ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక కార్యాలయానికి సునీల్‌కుమార్‌ యాదవ్‌ను తీసుకెళ్లారు. కాగా, వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, మాజీ డ్రైవర్‌ దస్తగిరి, పాల వ్యాపారి ఉమాశంకర్‌రెడ్డి, పులివెందులకు చెందిన చెప్పుల షాపు యజమాని మున్నాలను సీబీఐ అధికారులు శుక్రవారం కూడా విచారించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top