ఏ‘మార్చుదామని..!’

Students Who Changed Answer Sheets In Srikakulam District - Sakshi

మూల్యాంకనం కోసం వెళ్లే జవాబు పత్రాలను మార్గమధ్యంలో మార్చేసిన ఘనులు 

హాల్‌టిక్కెట్‌ జత చేయడంతో అడ్డంగా దొరికారు

శ్రీకాకుళం జిల్లా వాసే సూత్రధారి 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: విజయనగరం జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు పక్కదారి పట్టారు. పరీక్షలు సరిగా రాయకుండానే అత్యధిక మార్కులు తెచ్చుకోవాలని దురాశకు పోయారు. పరీక్ష సమయంలో రాసిన జవాబు పత్రాలు మూల్యాంకనం కోసం జేఎన్‌టీయూకేకు వెళ్లే సమయంలో మార్చేసి, వాటి స్థానంలో ప క్కాగా చూసి రాసిన జవాబు పత్రాలను పెట్టేద్దామని పథక రచన చేశారు. అందులో భాగంగా జేఎన్‌టీయూకే ఔట్‌ సో ర్సింగ్‌ సిబ్బందితో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నారు. మూల్యాంకనం కోసం వెళ్లే జవాబు పత్రాల వాహనాల రాకపోకలు అన్నీ తెలిసిన శ్రీకాకుళం వాసి ప్లాన్‌ ప్రకారం మార్గ మధ్యలో ఆ విద్యార్థుల జవా బు పత్రాలు మార్చేశాడు. మూ ల్యాంకనం సమయంలో ముగ్గురు విద్యార్థుల జవాబు పత్రాలు నూరు శాతం పక్కా గా ఉండడంతో ఎగ్జామినేషన్‌ సిబ్బందికి అ నుమానం వచ్చింది. దాని తో పాటు జవాబు పత్రాలకు ముగ్గురు విద్యార్థుల హాల్‌ టిక్కెట్లు అతికించి ఉండటాన్ని గుర్తించారు. సాధారణంగా జవాబు పత్రాలకు హాల్‌టిక్కెట్లు అతికించి ఉండవు. అడ్డదారి పట్టిన విద్యార్థులు తొందరలో తమ హాల్‌ టిక్కెట్లను జవాబు పత్రాలకు పెట్టేశారు. (చదవండి: అసూయపడి.. ఉసురు తీసి

ఇంకేముంది అడ్డంగా దొరికిపోయారు. జేఎన్‌టీయూకే అధికారుల దృష్టికెళ్లాక పూర్తిగా ఆరా తీసే సరికి మొత్తం గుట్టు రట్టయ్యింది. ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి శ్రీకాకుళం జిల్లా వాసే. ఈయన గతంలో ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎగ్జామినేషన్‌ విభాగంలో పనిచేసి మానేశాడు.   గత ఏడాది నవంబర్‌లో బీటెక్‌ ప్రథమ సంవత్సర మొదటి సెమిస్టర్‌ పరీక్షలు జరిగాయి. విజయనగరం జిల్లా ప్రైవేటు కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు జంబ్లింగ్‌లో భాగంగా విశాఖ జిల్లాలోని ఇంజినీరింగ్‌ కళాశాలలో పరీక్షలు రాశారు. పరీక్షలు అయ్యాక జవాబు పత్రాలను మూ ల్యాంకనం కోసం ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్టు లారీల ద్వా రా కాకినాడ జేఎన్‌టీయూకే వర్సిటీకు వెళ్లాయి. వర్సిటీ పరీక్షల విభాగానికి చెందిన సిబ్బంది లారీల ద్వారా వాటిని తీసుకు వెళ్లారు. అంతవరకు బాగానే ఉన్నా దానికి ముందు జరిగిన డీల్‌ ఏకంగా మార్గ మధ్యంలో జవాబు పత్రాలను మార్చేసే వరకు వెళ్లింది.  శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాల లో పనిచేసి మానేసిన రామ్మోహన్‌ అనే వ్యక్తి జేఎన్‌టీయూకే ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందితో ఉన్న పరిచయాలను అడ్డగోలు వ్యవహారానికి వాడుకున్నాడు. (చదవండి: రైలు ప్రయాణికులూ...ఇవి పాటించాలి)

ముందుగా విజయనగరం ఎంవీజీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులను ట్రాప్‌ చేశాడు. పరీక్ష సమయంలో ఎలా రాసినప్పటికీ మూల్యాంకనం కోసం వెళ్లే స మయంలో వాటిని తీసేసి, నూరు శాతం పక్కాగా రాసిన జవాబు పత్రాలను పెట్టించే ఏర్పాటు చేస్తాన ని ముగ్గురు విద్యార్థులకు హామీ ఇచ్చాడు. అనుకున్నట్టుగానే వర్సిటీ సిబ్బంది, రామ్మోహనరావుతో కలిసి ముందస్తు పథకం ప్రకారం జవాబు పత్రాలను మార్చేశారు. వైజాగ్‌ దాటిన తర్వాత ఒప్పందం కు దుర్చుకున్న ముగ్గురు విద్యార్థుల జవాబు పత్రాలు మార్చారు. కాకపోతే పొరపాటున వారి హాల్‌ టి క్కెట్లు కూడా జవాబు పత్రాలతో ఉంచేశారు. జవా బు పత్రాలతో పాటు హాల్‌టిక్కెట్‌ కూడా జతపరిచి ఉండటం, రైటింగ్‌ చాలా అందంగా ఉండటంతో పా టు అన్ని ప్రశ్నలకు సక్రమంగా సమాధానాలు ఉండటంతో వర్సిటీ సిబ్బందికి అనుమానం వచ్చింది. దీనిపై సబ్జెక్టు నిపుణుల కమిటీ వేశారు. పరీక్ష రాసిన విద్యార్థులతో పాటు రామ్మోహన్‌ను విచారించడంతో నిజం బయటకు వచ్చింది.  జవాబు పత్రాలు ఏ స మయంలో ఏ రకంగా వస్తాయన్నది ఎలా తెలిసింద ని రామ్మోహన్‌ను ఆరా తీసే సరికి గతంలో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలో పనిచేశానని, అప్పట్లో జేఎన్‌టీయూకే ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందితో పరిచయాలు ఏర్పడ్డాయని, వారితో కలిసి ఈ రకంగా చేశామని రామ్మోహన్‌ సంబంధిత కంట్రోల్‌ ఎగ్జామినర్‌కు చెప్పినట్టు సమాచారం. మొత్తానికి గుట్టు రట్టు అవడంతో అప్రమత్తమైన జేఎన్‌టీయూకే అధికారులు అప్రమత్తమై కాకినాడ పోలీసులకు ఫిర్యాదు చేశార

తప్పు ఒప్పుకున్నారు  
నిపుణుల కమిటీ వేశాం. విద్యార్థులను, ఎగ్జామినేషన్‌ విభాగంలోని ఉద్యోగి రామ్మోహన్‌ను పిలిచి మాట్లాడాం. తప్పు చేశామని ఒప్పుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశాం. జేఎన్‌టీయూ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ముగ్గురిని విధుల నుంచి తొలగించాం. విద్యార్థులపైన, రామ్మోహన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాం.  
– సత్యనారాయణ, జేఎన్‌టీయూకే రిజిస్ట్రార్‌    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top